టీడీపీ -జనసేన కూటమి ఎఫెక్ట్‌తో వైసీపీకి ఇబ్బందులు తప్పవని సంకేతాలు వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తం గా పరిస్తితిని అంచనా వేస్తే.. కీలకమైన ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ సారి వైసీపీ ఇబ్బంది పడుతుందని అంటున్నారు. ఈ రెండు జిల్లాలతో పాటు.. గుంటూరు, అనంతపురం జిల్లాల్లోనూ.. వైసీపీ తుడిచి పెట్టు కుపోతుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. గత 2019 లెక్కలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఆ ఎన్నికల్లో టీడీపీ, జనసేన వేర్వేరుగా పోటీ చేశాయి
దీంతో ఓటు బ్యాంకు చీలిపోయి.. జనసేనకు కొంత… టీడీపీకి కొంత పడి. వైసీపీ అభ్యర్థులు సల్పమెజారి టీతోనే విజయం దక్కించుకున్నారు. ఇప్పుడు ఈ రెండు పార్టీలూ కలిసి ఉమ్మడిగా పోరుకు రెడీ అయిన నేపథ్యంలో గంపగుత్తగా ఆ ఓట్లు.. ఒకే అభ్యర్తికి పడితే.. వైసీపీకి నష్టం కలగనుంది. పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ.. గుంటూరులో రాజధాని ప్రభావం పక్కగా కనిపిస్తోంది. ఇక, అనంతపురంలో టికెట్ల ప్రభావం.. వైసీపీకి ఇబ్బందిగా మారనుంది.
ఇక, ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు నేతలు.. జనసేన ఏ రూపంలో ఉన్నా.. సహకరించాలని.. తమ నాయ కుడు అసెంబ్లీలో అడుగు పెట్టాలని కోరుకుంటున్నారు. దీంతో ఈ జిల్లాల్లోని సీట్ల వ్యవహారం కూడా.. వైసీపీకి మైనస్‌గా మారనుంది. ఇక్కడ పొత్తుల ఎత్తులు బాగానే పనిచేస్తాయని భావిస్తున్నారు. అదేసమయంలో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ఫోకస్ కూడా.. ఈ రెండు జిల్లాలు, విశాఖ, అనంతపురంపైనే ఉంటాయని తెలుస్తోంది. ప్రాథమికంగా అందిన షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్రవరి 4 నుంచి ప్రారంభించనున్న వారాహి యాత్ర.. ఈ జిల్లాల్లోనే మెజారిటీ గా సాగనుంది.
మరోవైపు.. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వైసీపీ చేసిన మార్పులతో ఇక్కడి నాయకులు జనసేనకు అనుకూలంగా మారుతున్నాయి. జ్యోతుల చంటిబాబు పవన్‌తో టచ్‌లోకి వెళ్లిపోయారు. ఆయనకు టికెట్ ఇస్తారా? లేదా? అనేది పక్కన పెడితే.. ఈ ప్రభావం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఇక, రాజులు కూడా నరసాపురంలో రఘురామవైపు ఉన్నారనేది వస్తున్న వార్తలను బట్టి తెలుస్తోంది. సో.. ఎలా చూసుకున్నా.. టీడీపీ-జనసేన మిత్రపక్షంతో కనీసంలో కనీసం.. మూడు జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.