మార్చ్ 23, 2021 మంగళవారం సాయంకాలం కొలంబస్ మహానగరంలో కోశాధికారి జగదీష్ ప్రభల మరియూ వారి బృందం ఆధ్వర్యంలో దావత్ ఫలహారశాలలో రెండవసారి నిర్వహించిన తానా ఎన్నికల ప్రచారంలో సంస్ధ పెద్దలు జయరాం కోమటి, గంగాధర్ నాదెళ్ళ గారలతో పాటుగా డాక్టర్ నరేన్ కొడాలి, భక్తా భల్ల మరియూ రాజా సూరపనేని వక్తలుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి బాలాజీ కొడాలి మరియూ శ్రీనివాస్ సంగా వాఖ్యాతలుగా వ్యవహరించారు. జయరాం కోమటి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్తుతులకు దారితీసిన పరిణామాలను వివరించారు. గంగాధర్ గారు, జయరాం గారు డాక్టర్ నరేన్ కొడాలిని సమర్ధించడానికి గల కారణాలని తెలిపారు. విద్యాధికుడైన డాక్టర్ నరేన్ కొడాలి గారి అనుభవం విద్యారంగంలో మునుముందు తానా అందించబోయే సేవలకి ఉపయోగ పడుతుంది అని తెలిపారు. కొడాలి పానెల్ లో ఉన్న ప్రతి అభ్యర్ధి తానా సంస్ధకి చేసిన సేవలని వివరించి, పదవికి వాళ్ళకి ఉన్న అర్హతని చూసి ఓటుని వేయవలసిందిగా అందరినీ కోరారు. డాక్టర్ నరేన్ కొడాలి తన అచ్చ తెలుగు ప్రసంగంలో వారి కార్యవర్గం చెయ్యాలనుకున్న మార్పులను వివరించారు. ఆ తరువాత భక్త భల్ల తన అభ్యర్ధిత్వాన్ని తిరస్కరించడానికి పోత్సహించిన కారణాలని వివరించి అందరిని కలుపుకు వెడుతూ కార్పొరేట్ మరియూ కార్యకర్తల మధ్య వ్యత్యసాన్ని గమనించి డాక్టర్ కొడాలి పానెల్ కి ఓటు వెయ్యవలసిందిగా అందరినీ కోరారు. పౌండేషన్ ధర్మకర్తగా పోటీ చేస్తున్న రాజా సూరపనేని తమ పానెల్ కి ఓటు వెయ్యవలసిందిగా అందరినీ కోరారు.
చివరిగా కోశాధికారిగా పోటీ చేస్తున్న జగదీష్ ప్రభల తానాతో ముప్ఫై ఐదు సంవత్సరాలుగా తనకున్న అనుబంధాన్ని తెలుపుతూ, కోశాధికారి పదవికి వారికున్న MBA(Finance) మరియూ Chartered Public Accountant (CPA) ఉన్నతవిద్య ఎలా ఉపయోగపడుతుందో తెలియజేశారు. కోశాధికారిగా వారు చేయదలుచుకున్న మార్పులని వివరించారు. ఆఖరుగా గత నలభై సంవత్సరాలుగా తానాకి స్వచ్చందంగా సేవలందించిన అన్నల్లాంటి పెద్దలని బయటకి పంపించండం మంచిదిగాదని భావోద్వేగంగా విన్నవించుకున్నారు. చివరిగా నిర్వహించిన ప్రశ్నలు, సమాధానాలతో కార్యక్రమం ముగిసింది. తానా పెద్దలని, డాక్టర్ కొడాలి బృందాన్ని కొలంబస్ ఉమెన్ కమ్యూనిటీ క్లబ్ సంఘ సభ్యులు పుష్పగుచ్చాలతో అహ్వానించారు. పనిదినమే అయినా ఈ కార్యక్రమానికి డెబ్బై మందికి పైగా పురప్రముఖులు విచ్చేసి జయప్రదం చేశారు. ఈ కార్యక్రమానికి ముందుగా జూమ్ ద్వారా సిన్సినాటి మహానగరంలో నివసిస్తున్న తానా సభ్యులలో కొడాలి ప్యానెల్ బృందం తో పాటుగా కోమటి, నాదెళ్ళ గారలు ప్రచార కార్యక్రమం నిర్వహించారు.