సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో కొత్త కీలక పరిణామం చోటుచేసుకుంది. అతని రూమ్మేట్ సిద్ధార్థ్ పిథానిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) అరెస్టు చేసింది.
జూన్ 14 న ముంబైలోని సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇంట్లో తన గదిలో ఉరివేసుకున్నట్లు గుర్తించిన నలుగురిలో సిద్ధార్థ్ పితాని కూడా ఉన్నారు. అతన్ని ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లో డ్రగ్స్ నిరోధక సంస్థ అరెస్టు చేసినట్లు సమాచారం.
దేశాన్ని ఆకర్షించిన ఈ కేసులో ఎన్నో కుట్రలు, మరెన్నో కోణాలు. ముంబై చిత్ర పరిశ్రమను నిట్టనిలువునా చీల్చిన కేసు ఇది. ఈ కేసులో ముంబై పోలీసులు మరియు సిబిఐ మిస్టర్ పిథానిని పలుసార్లు ప్రశ్నించారు. సుశాంత్ రాజ్‌పుత్ మృతిపై దర్యాప్తులో భాగంగా వెలువడిన డ్రగ్స్ కేసులో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రియురాలు రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోయిక్‌తో సహా పలువురిపై అభియోగాలు మోపిన విషయం తెలిసిందే.
రియా చక్రవర్తి ఫోన్లో దొరికిన వాట్సాప్ చాట్స్‌లో నటుడి కోసం డ్రగ్స్ కొన్నట్లు తేలడంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఈ కేసులోకి అడుగుపెట్టింది. చివరకు ఈ కేసు డ్రగ్ మాపియాను వెలుగులోకి తెచ్చింది. దీంతో బాలీవుడ్ కి – మాదకద్రవ్యాలకి మధ్య సంబంధంపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఈ కేసులో చాలా మంది ప్రముఖ నటులు, ప్రముఖులను కూడా ప్రశ్నించారు.
తాజాగా అరెస్టైన ఐటి ప్రొఫెషనల్, మిస్టర్ పిథాని… సుశాంత్ మరణంలో చివరి క్షణాల గురించి న్యూస్ ఛానెళ్లకు చెప్పారు. సుశాంత్ రాజ్‌పుత్ పితానిని “బుద్ధ” అని పిలిచేవారట. ఏడాది పాటు పితాని సుశాంత్ తోనే నివసిస్తున్నారు.