అనూహ్యంగా చోటు చేసుకునే పరిణామాలు.. ఆ సందర్భంగా వారు రియాక్టు అయ్యే తీరుతో సదరు వ్యక్తి వ్యక్తిత్వం ఏ రీతిలో ఉంటుందో అర్థమవుతుంది. కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న స్టార్లు.. సెలబ్రిటీలు.. ప్రముఖులు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే వారి రియాక్షన్ వారి ఇమేజ్ ను ప్రభావితం చేస్తుంటుంది.తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి స్టార్ హీరో అల్లు అర్జున్ అలియాస్ బన్నీకి ఎదురైంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
ఇటీవల చెన్నైలో జరిగిన అవార్డు ఫంక్షన్ కు అల్లు అర్జున్ హాజరయ్యారు. ‘గోల్డెన్ ఐకాన్ ఆఫ్ ఇండియన్ సినిమా’గా అల్లు అర్జున్ అవార్డును సొంతం చేసుకున్నారు. రెహమాన్ చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకున్న వేళ.. స్టేజ్ మీద అనూహ్యంగా చోటు చేసుకున్న పరిణామానికి బన్నీ సూపర్ సర్ ప్రైజ్ అయ్యారు. ఎందుకిలా అంటే.. బన్నీ మూడో తరగతి చదివే వేళలో పాఠాలు చెప్పిన స్కూల్ టీచర్ వేదిక మీదకు రావటమే. ఆమెను చూసినంతనే సర్ ప్రైజ్ అయిన బన్నీ.. ఆ వెంటనే ఆమె కాళ్లకు నమస్కారం పెట్టి తనలోని సంస్కారాన్ని బయటపెట్టారు. అనంతరం తన బాల్యంలోకి వెళ్లి వచ్చారు.
తొలుత.. బన్నీ టీచర్ మాట్లాడారు. తన కొడుకులాంటి బన్నీ గురించి నేనేం చెప్పేది? మంచి హీరోగా పేరు తెచ్చుకొని మా టీచర్లందరికి గర్వకారణం అయ్యాడని పేర్కొన్నారు. ‘‘మేము అతన్ని ఎప్పుడూ అర్జున్ అని పిలవలేదు. అల్లూస్ అని పిలిచేవాళ్లం. పుట్టటమే డ్యాన్సింగ్ షూస్ తో పుట్టాడనిపిస్తుంది. తనని చూసి ఎంతో గర్వపడుతున్నా. ఇలానే ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నా’’ అని పేర్కొన్నారు.
అనంతరం తన క్లాస్ టీచర్ గురించి బన్నీ ఎమోషన్ అయ్యారు. ఆమె గురించి ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. ‘‘మా టీచర్పేరు అంబికా క్రిష్ణణ్. మూడో తరగతిలో జాగ్రఫీ టీచర్.నేను చదువుకునే క్రమంలో ఎంతోమంది టీచర్స్ నాకు పాఠాలు చెప్పారు.కానీ.. వారందరీలో ఈ టీచర్ కే ఫస్ట్ ప్లేస్ ఇస్తాను. క్లాస్ లో యాభై మంది స్టూడెంట్స్ ఉంటే.. నాదే లాస్ట్ ర్యాంక్. అంత పూర్ స్టూడెంట్ ని. అయినా.. ఆమె నన్ను ఎప్పుడూ తిట్టలేదు’అని గతాన్ని గుర్తు చేసుకున్నారు. జీవితం అంటే చదువు ఒక్కటే కాదని.. జీవితం అనేది ప్రతి ఒక్కరికి వరమని.. దాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఉన్నత శిఖరాలకు వెళతావని ఆమె ఎప్పుడూ చెబుతుండేవారన్నారు.
ప్రతి టీచర్ అలా ఉండాలని తాను కోరుకుంటానని చెబుతూ.. ‘ఈ రోజు ఇలా చూస్తుంటే నాకెంతో సర్ ప్రైజింగ్ గా ఉంది. నాకు చిన్నప్పటి నుంచి స్ఫూర్తి నింపేలా చిన్న చిన్న కోట్స్ రాయటం అలవాటు. అలా నేను రాసిన ‘‘Only Kindness is Remembered Forever’’ అన్న కోట్ కు ఈ టీచరే స్ఫూర్తి’’ అని పేర్కొన్నారు. నిజంగానే.. అంబికా క్రిష్ణన్ లాంటి టీచర్లు ఉంటే.. సాదాసీదా స్టూడెంట్స్ అద్భుతాలు క్రియేట్ చేసే వీలుంటుంది.
Icon Star @alluarjun Meets His School Teacher After 30 Year's ❤️????
Thank You So Much @behindwoods ????#Pushpa2TheRule #PushpaTheRule pic.twitter.com/0IdGBj2PTL
— TelanganaAlluArjunFC™ (@TelanganaAAFc) May 9, 2023