ప్రముఖ బిలియనీర్ ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ఇటీవల వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. తన ప్రియసఖి రాధికా మార్చంట్ ను జూలై 12న అనంత్ అంబానీ పెళ్లాడారు. యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా వీరి వివాహం జరిగింది. దేశ, విదేశాల నుంచి సినీ, రాజీకయ, క్రీడా, వ్యాపార మరియు ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు అంబానీ ఇంట జరిగిన పెళ్లిలో సందడి చేశారు.
మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ సైతం ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇకపోతే తన కుమారుడి పెళ్లికి వచ్చిన అతిథులందరికీ ముఖేష్ అంబానీ-నీతా అంబానీ దంపతులు ఎంతో విలువైన కానుకలు ఇచ్చారు. అలాగే అతిథులు కూడా అంతే ఖరీదైన బహుమతులు ఇవ్వడం విశేషం. ముఖ్యంగా బాలీవుడ్ కు చెందిన పలువురు స్టార్స్ అనంత్, రాధికా కపుల్ కు కాస్ట్లీ గిఫ్ట్ లు ఇచ్చారట.
ఈ జాబితాలో మొదట చెప్పుకోవాల్సింది బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ గురించే. అనంద్ అంబానీ దంపతులకు షారుక్ ఖాన్ ఫ్రాన్స్ లో ఓ లగ్జరీ ఫ్లాట్ ను కానుకగా ఇచ్చారట. ఈ ఫ్లాట్ ఖరీదు రూ. 40 కోట్లు ఉంటుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే ముఖేష్ అంబానీ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడైన అమితాబ్ బచ్చన్ మరియు అతని ఫ్యామిలీ కలిసి పెళ్లి కూతురు రాధికా మర్చంట్ కు రూ.30 కోట్ల విలువైన ఓ నెక్లెస్ ను ఇచ్చారట.
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ పెళ్లి కానుకగా అనంత్ అంబానీకి రూ.16 కోట్లు ఖరీదు చేసే స్పోర్ట్స్ బైక్ ను ప్రజెంట్ చేశారట. మరోవైపు దీపికా పదుకొనే, రణ్వీర్ సింగ్ జంట అనంత్ అంబానీ-రాధిక కపుల్ కు ఏకంగా రూ.20 కోట్ల విలువైన కస్టమైజ్డ్ రోల్స్ రాయ్స్ కారును గిఫ్ట్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారం పట్ల నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అనంత్ అంబానీ లాంటి అపర కుబేరులకు అన్నన్ని కోట్లు పెట్టి కానుకలు ఇచ్చే బదులు.. ఆ డబ్బును పేదల కోసం ఖర్చు పెట్టి ఉంటే జీవితం మీకు రుణపడి ఉండేవారని బాలీవుడ్ స్టార్స్ పై నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు.