స్టార్ బ్యూటీ సమంత మళ్లీ పెళ్లి చేసుకోబోతుందా? అంటే సోషల్ మీడియాలో అవునన్న సమాధానమే వినిపిస్తోంది. ఇప్పటికే సమంత మాజీ భర్త నాగచైతన్య ఓ ఇంటివాడు అయ్యారు. ప్రముఖ హీరోయిన్ శోభిత ధూళిపాళ్లను పెళ్లాడి కొత్త లైఫ్ ప్రారంభించాడు. సమంతకు కూడా ఒక మంచి తోడు దొరికితే చూడాలని ఆమె అభిమానులు ఆకాక్షిస్తున్నారు. పైగా ఇటీవల తనకు పిల్లలు కావాలంటూ సామ్ స్వయంగా మనసులో కోరిక బయటపెట్టింది.
తాజాగా ఒక్క పోస్ట్ తో తనకు మళ్లీ వివాహం చేసుకునే ఉద్దేశం ఉందని పరోక్షంగా బిగ్ హింట్ ఇచ్చేసింది. తమకు నూతన సంవతర్వం ఎలా ఉండబోతుందో తెలిసుకునేందుకు ప్రతి ఒక్కరూ ఆరాటపడుతుంటారు. ఇందులో భాగంగా 2025 తన రాశి వారికి ఎలా ఉండబోతోందనే వివరాల జాబితాను సమంత ఇన్స్టా స్టోరీ ద్వారా పంచుకుంది.
అందులో వృషభ, కన్య, మకర రాశి వారు కొత్త ఏడాది మొత్తం బిజీబిజీగా ఉంటారని, వృత్తితో మరింత ఎదగడమే కాకుండా డబ్బులు బాగా సంపాదిస్తారని, ఆర్థిక స్థిరత్వం పొందుతారని ఉంది. అలాగే 2025 లో నమ్మకమైన, ప్రేమించే భాగస్వామి లభిస్తాడని, సంతానం పొందుతారని ఉంది. అంతేకాకుండా ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న లక్ష్యాలను ఫుల్ ఫిల్ చేసుకుంటారని, ఆదాయ మార్గాలు పెంచుకుంటారని, మానసికంగా మరియు శారీరకంగా మరింత స్ట్రాంగ్ అవుతారని ఉంది. అయితే జాబితాలో ఉన్నవన్నీ జరగాలనీ సమంత కోరుకోవడం విశేషం. దీంతో అభిమానులు సైతం వచ్చే ఏడాది సమంత మళ్లీ పెళ్లి చేసుకుని పిల్లల్ని కని సంతోషంగా ఉండాలని ఆకాక్షిస్తున్నారు.