సౌత్ స్టార్ బ్యూటీ సమంత పర్సనల్ లైఫ్ గురించి మనందరికీ తెలిసిందే. 2017లో నాగ చైతన్యను సమంత ప్రేమ వివాహం చేసుకుంది. అయితే వీరి బంధం 2021లో విడాకులతో ముగిసింది. ఆ తర్వాత నాగ చైతన్య ప్రముఖ హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో లవ్ లో పడ్డాడు. రెండేళ్ల నుంచి సీక్రెట్ రిలేషన్ లో ఉన్న ఈ జంట.. రీసెంట్ గా కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. నాగ చైతన్య రెండో పెళ్లికి రెడీ అవ్వడంతో.. సమంత సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
సమంత కూడా మళ్లీ వివాహం చేసుకోవాలని అభిమానులు ఆకాక్షిస్తున్నారు. ఇదే తరుణంలో ఓ పెళ్లి ప్రపోజల్ రాగా.. సమంత ఓకే చెప్పింది. అవును, మీరు విన్నది నిజమే. ముకేశ్ అనే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ సమంతకు పెళ్లి ప్రపోజల్ పెట్టాడు. `సమంత నువ్వు బాధ పడాల్సిన అవసరం లేదు. నీకోసం నేనున్నాను. నువ్వు నేను కలిస్తే మంచి జంట అవుతుంది. నీకు నచ్చితే మనం పెళ్లి చేసుకుందాం. నాకొక రెండేళ్లు టైమ్ ఇవ్వు.. బాగా డబ్బులు సంపాదిందిచ నీ దగ్గరికి వస్తాను. అప్పటివరకు నా గుర్తుగా ఈ పువ్వు అదే హార్ట్ను ఉంచుకో. ప్లీజ్ మ్యారీ మీ సామ్` అంటూ ఇన్స్టాలో ఓ వీడియో ద్వారా సదరు అభిమాని సమంతకు ప్రపోజ్ చేశాడు.
అయితే ముకేశ్ వీడియోకు సమంత స్పందించడం విశేషం. నీ బ్యాక్ గ్రౌండ్ లో కనిపిస్తున్న జిమ్ నన్ను కన్విన్స్ చేస్తుంది అంటూ సదరు అభిమానికి ఫన్నీగా సమంత ఓకే చెప్పింది. స్వయంగా సామ్ రిప్లై ఇవ్వడంతో ముకేశ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. `సమంతకు మిలియన్ ఫ్యాన్స్ ఉంటే అందులో నేను ఒకడిని.. 10 మంది ఫ్యాన్స్ ఉంటే అందులో ఒకడిని.. కేవలం ఒక ఫ్యాన్ ఉంటే అది ఒక్కడు నేనే.. అసలు ఒక్క ఫ్యాన్ కూడా లేడంటే.. నేను ఈ ప్రపంచంలో లేనని అర్థం. ఒకవేళ సమంతకు ఈ ప్రపంచం వ్యతిరేకమైతే.. నేను ప్రపంచానికి వ్యతిరేకిని` అంటూ ఇన్స్టా స్టోరీలో మరింత స్వీట్ అండ్ రొమాంటిక్ గా సమంతపై ముకేశ్ తన ప్రేమను తెలియజేశాడు.
View this post on Instagram