లేడీ పవర్ స్టార్, న్యూచురల్ బ్యూటీ అన్న పదాలు వినపడగానే గుర్తుకువచ్చే పేరు సాయి పల్లవి. హీరోయిన్లంతా గ్లామర్ పుంతలు తొక్కుతుంటే.. ఒక్క సాయి పల్లవి మాత్రం తన రూటే సపరేటు అన్నట్లుగా వ్యవహరిస్తోంది. కథలో ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకులను అలరిస్తోంది. త్వరలోనే `అమరన్` మూవీతో థియేటర్స్ లో సందడి చేయబోతోంది. దివంగత మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత చరిత్ర ఆధారంగా రాజ్‌కుమార్ పెరియసామి అమరన్ చిత్రాన్ని తెరకెక్కించారు.
ఇందులో ముకుంద్ వరదరాజన్ పాత్రలో శివ కార్తికేయన్.. అతని భార్య ఇందు రెబెకా వర్గీస్‌గా సాయి పల్లవి నటించారు. ఈ బయోగ్రాఫికల్ యాక్షన్ వార్ చిత్రం దీపావళి పండుగ కానుకగా అక్టోబర్ 31న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయిలో ఏర్పడ్డారు. ప్రచార కార్యక్రమాల ద్వారా చిత్రబృందం అమరన్ పై మరింత బజ్ క్రియేట్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. అమరన్ మూవీకి సాయి పల్లవి తీసుకున్న రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తనకున్న సక్సెస్ రేటు మరియు పాత్రకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా సాయి పల్లవి హీరోల రేంజ్ లో పారితోషికం పుచ్చుకుంటోందట. అందులో భాగంగానే అమరన్ కోసం రూ. 3 కోట్లు ఛార్జ్ చేసిందని ఫిల్మ్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న హైయ్యెస్ట్ పెయిడ్ హీరోయిన్స్ లో సాయి పల్లవి ఒకరిగా చేరినట్లే అవుతుంది.