నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. మంచి జర్నలిస్ట్ కావాలని కలలు కన్న ఈ అందాల భామ.. అనూహ్యంగా నటన వైపు అడుగులు వేసింది. `కిరిక్ పార్టీ` అనే కన్నడ మూవీతో సినీ రంగ ప్రవేశం చేసిన రష్మిక.. వెంకీ కుడుముల దర్శకత్వంలో నాగ శౌర్య హీరోగా తెరకెక్కిన `ఛలో` సినిమాతో టాలీవుడ్లోకి అడుగు పెట్టింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో మరిన్ని ఆఫర్లు అందుకున్న రష్మిక.. అనతి కాలంలోనే తనదైన టాలెంట్‌తో స్టార్ హాదాను సొంతం చేసుకుంది.
ప్రస్తుతం తెలుగుతో పాటు తమళ్, కన్నడ, హిందీ భాషల్లోనూ నటిస్తున్న ఈ బ్యూటీ.. మరోవైపు సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉంటూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది. ఇప్పటికే ఈమె ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య ఏకంగా 29 మిలియన్లకు చేరుకుంది. ఇకపోతే రష్మిక మంచి ఫిట్నెస్ ఫ్రీక్ అన్న సంగతి తెలిసిందే. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ వ్యాయామాలను మాత్రం ఈమె అస్సలు మిస్ అవ్వదు.
ఈ నేపథ్యంలోనే తన ఫాలోవర్స్‌కు తాజాగా రష్మిక ఫిట్నెస్ సూత్రాలను వల్లించింది. వర్కవుట్స్ అనంతరం జిమ్‌లో దిగిన ఓ పిక్‌ను ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసిన రష్మిక.. `ఈ ఫోటో పోస్ట్ చేయడం కరెక్టో కాదో నాకు తెలీదు. చాలా మందికి ఈ ఫోటో నచ్చకపోవచ్చు. కానీ నేను ఈ పిక్‌ను ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే మన ఫిట్నెస్ విషయంలో గోల్స్ ఎప్పుడు స్థిరంగా ఉండాలి.
కేవలం జిమ్‌కి వెళ్లి వ్యాయామాలు చేస్తే సరిపోదు.. ఆహారం విషయంలో చాలా శ్రద్ధ తీసుకోవాలి. తొలుత ఈ వర్కవుట్స్, ఆహార నియంత్రణ చాలా కష్టంగా అనిపిస్తుంది. కానీ ఒక్కసారి అలవాటు చేసుకుంటే..మీలో అద్భుతాలు చోటుచేసుకుంటాయి` అంటూ రాసుకొచ్చింది. దీంతో ఇప్పుడీమె పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది.
కాగా, సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల రష్మిక `పుష్ప`, `ఆడవాళ్ళు మీకు జోహార్లు` చిత్రాలతో ప్రేక్షకులను పలకరించింది. వీటిలో పుష్ప హిట్టైనా.. ఆడవాళ్ళు మీకు జోహార్లు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఇక ప్రస్తుతం రష్మిక బన్నీ సరసన పుష్ప పార్ట్ 2 చేస్తుంది. తమిళంలో దళపతి విజయ్‌తో ఓ సినిమా చేసేందుకు సైన్ చేసింది. అలాగే బాలీవుడ్లో సిద్ధార్థ్ మల్హోత్రాతో `మిషన్ మజ్ను`, అమితాబ్ బచ్చన్‌తో `గుడ్ బై` సినిమాలు చేస్తోంది. వీటితో పాటు మరిన్ని ప్రాజెక్ట్స్ సైతం ఆమె చేతిలో ఉన్నాయి.