సాయిరెడ్డి అబద్ధాలు ఆడటంలో ఇండియా నెం.1 అని తెలుగుదేశం ఆరోపిస్తుంటుంది.
కానీ దానిని ఈరోజు కేంద్రంలోని రాజ్యసభ రాత పూర్వకంగా ఖరారు చేసింది.
అసలు కథ తెలుసుకోవాలంటే ముందు ఈ ట్వీట్ చూడండి.
Sad…Democracy is put to shame in Vizag on R Day. #shameonapgovt
— Vijayasai Reddy V (@VSReddy_MP) January 26, 2017
అవి ప్రత్యేక హోదా ఉద్యమం ఊపులో ఉన్న రోజులు.
26 జనవరి 2017లో విశాఖ ఆర్కే బీచ్లో ప్రత్యేక హోదా కోసం ర్యాలీ చేయడానికి ప్రజాసంఘాలు సిద్ధమయ్యాయి
విశాఖపట్నం నగరంలోని బీచ్ వద్ద ర్యాలీకోసం ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి వచ్చారు.
అప్పటివరకు ప్రత్యేక హోదాపై ప్రజలకు అంత ఆసక్తి ఉందని వైసీపీకి అర్థం కాలేదు. దీంతో పట్టించుకోలేదు.
కానీ ఆరోజు భారీగా స్పందన రావడంతో ఉలిక్కిపడిన జగన్, విజయసాయి… ముఖ్యనేతలను వెంటేసుకుని హైదరాబాద్లో విమానం ఎక్కి విశాఖలో దిగారు. అయితే అప్పటికే పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలకు కారణం తర్వాత రోజు అంటే 2017 జనవరి 27వ తేదీ నుంచి విశాఖలో పెట్టుబడుల సదస్సు ఉండడం. ఏపీ బ్రాండ్ ను ప్రమోట్ చేయడానికి అంతర్జాతీయ సదస్సు ఏర్పాటుచేశారు.
అంతర్జాతీయ మీడియా విశాఖలో ఉంది. అపుడు ఏపీపరువు పోకుండా పోలీసులు నిరసనకారులను అదుపుచేశారు. అదేసమయంలో జగన్ ను అడ్డుకున్నారు. పోలీసులను తోసేసిన జగన్ విజయసాయి వారిపై చిందులు తొక్కారు. తిట్టారు. వార్నింగ్ ఇచ్చారు.
పోలీసులను తిట్టిన విజయసాయి రివర్సులో తనపైనే దాడి చేశారంటూ ఎంపీ హోదాలో రాజ్యసభ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు.
కట్ చేస్తే…
ఈ ఫిర్యాదును పరిశీలించిన ప్రివిలేజ్ కమిటీ ఆయన తప్పుడు ఫిర్యాదు చేశారని తేల్చింది. ఆయనపై దాడికి ఆధారాలు లేవని తెలిపింది. దీంతో విజయసాయిరెడ్డి ఆరోజు చెప్పింది అబద్ధమని లిఖితపూర్వకంగా, ఆధార సహితంగా తేలిపోయింది.