తెలుగు జాతి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో చాటి చెప్పిన దర్శకధీరుడు, మోస్ట్ సక్సెస్ ఫుల్ పర్సన్ రాజమౌళి బుల్లితెర స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ తో ప్రేమ కథ నడిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సీరియల్ డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన రాజమౌళి.. ఆ తర్వాత సినీ దర్శకుడిగా మారారు. అంచెలంచెలుగా ఎదుగుతూ ఇండియాస్ నెంబర్ వన్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు.
రష్మీ గౌతమ్ విషయానికి వస్తే.. `హోలీ` అనే మూవీ తో ఆమె కెరీర్ స్టార్ట్ చేసింది. వెండితెరపై హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోయినా.. బుల్లితెరపై స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ ఆరంభంలో రష్మీ `యువ` అనే సీరియల్ లో ప్రధాన పాత్రలో యాక్ట్ గా చేసింది. అన్నపూర్ణ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అక్కినేని నాగార్జున నిర్మించిన ఈ సీరియల్ 2007 సమయంలో సూపర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా యువతను ఈ సీరియల్ బాగా ఆకట్టుకుంది.
అయితే `విక్రమార్కుడు` మూవీ ప్రమోషన్స్ లో భాగంగా అప్పటికే టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న రాజమౌళి యువ సీరియల్ లో భాగం అయ్యారు. రష్మీతో ప్రేమ కథ నడిపించే వ్యక్తిగా రాజమౌళి నటించారు. ఇందుకు సంబంధించిన వీడియోనే ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అపరిచిత వ్యక్తిగా రష్మీతో ఫోన్ లోనే ప్రేమాయణం సాగించిన రాజమౌళి.. ఒకరోజు ఆమెను స్వయంగా మీట్ అవ్వడానికి వస్తాడు. ఆ తర్వాత వారిద్దరి మధ్య జరిగిన ఫన్నీ సంభాషణ నవ్వులు పూయిస్తుంది. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఇదెప్పుడు జరిగిందంటూ షాకైపోతున్నారు. ఇన్ని రోజులు ఈ వీడియో ఎలా మిస్ అయ్యిందబ్బా అంటూ కామెంట్ల మోత మోగిస్తున్నారు. మొత్తానికి రాజమౌళి, రష్మీ వీడియో మాత్రం ఇండస్ట్రీలో సెన్సేషన్‌గా మారింది.
View this post on Instagram