ఎప్పటికపుడు ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు వ్యవహారం కొత్త మలుపు తిరుగుతోంది.
బెయిల్ రద్దు చేయాలంటూ.. కొన్నాళ్ల కిందట హైదరాబాద్లోని నాంపల్లిలో ఉన్న సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషను వేశారు.
తరువాత అటు సీబీఐ, ఇటు జగన్ ఇద్దరు దానిని వాయిదాల మీద వాయిదాలు కోరుతూ వచ్చారు.
రేపు తీర్పు కూడా రానుంది. ఈ నేపథ్యంలో రఘురామరాజు భారీ ట్విస్ట్ ఇచ్చారు.
అక్రమాస్తుల కేసుకు సంబంధించి సీబీఐ దాదాపు 11 సంవత్సరాల కిందట నమోదు చేసిన కేసుల్లో.. వైసీపీ అధినేత జగన్ కొన్నాళ్లు జైల్లో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన బెయిల్ పొందారు. అప్పట్లో బెయిలే ఇవ్వద్దని పోరాడిన సీబీఐ నేడు మీ ఇష్టం అంటూ కోర్టుకు వదిలేయడంతో ఢిల్లీ పెద్దలు దీని వెనుక ఉన్నట్లు విశ్లేషకులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.
చాలారోజులుగా మోడీ వైసీపీ అధినేత జగన్ కు అండగా నిలిచిన విషయం తెలిసిందే. అందుకు గాను ఏపీకి ఏమీ అడగకుండా ఉంటానని, మీకు దేనికోసం అయినా పార్లమెంటులో మద్దతు ఇస్తానని జగన్ ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని పలుమార్లు నారా లోకేష్ ఆరోపించారు.
సీబీఐ వాదన చూస్తుంటే అది నిజమే అనిపించేలానే ఉంది. ఈ క్రమంలో సీబీఐ పేలవ వాదనతో రేపు జగన్ కి అనుకూలంగా తీర్పు వస్తుందేమో అన్న అనుమానంతో రఘురామరాజు సడెన్ గా కీలక నిర్ణయం తీసుకున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
RRR తాజాగా తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. సీఎం జగన్, విజయసాయి బెయిల్ రద్దు పిటిషన్ను మరో కోర్టుకు బదిలీ చేయాలని, సీబీఐ కోర్టు రేపు ఉత్తర్వులు ఇవ్వకుం డా ఆదేశాలు ఇవ్వాలని అందులో కోరారు. ఇంకా ఇది ఎన్ని మలుపులు తిరుగుతుందో