చిత్తూరు జిల్లా అనగానే.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బ్యాచే ఎక్కడైనా కనిపిస్తుంది. దాదాపు ఆరు నియోజకవర్గాల్లో ఆయన వర్గానికి చెందిన వారికే టికెట్ లు దక్కుతాయి. అది కాంగ్రెస్‌లో ఉన్నా.. వైసీపీ లో అయినా..పెద్దిరెడ్డి హవా కొనసాగుతూనే ఉంది. ఒకప్పుడు మిత్రులైన చంద్రబాబు -పెద్దిరెడ్డి రాజకీ యంగా కత్తులు దూసుకున్న క్రమంలో చిత్తూరు జిల్లాను తనకు అనుకూలంగా మార్చుకున్నారు పెద్దిరెడ్డి.
ఇక, అప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఎదిగారనే చెప్పాలి. ఈ క్రమంలోనే పలమనేరు, శ్రీకాళహస్తి, నగరి, చంద్రగిరి, పీలేరు, చిత్తూరు వంటి నియోజకవర్గాల్లో తన వారికే టికెట్లు ఇప్పించుకున్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఒకప్పుడు పెద్దిరెడ్డి శిష్యుడు కావడం గమనార్హం. అదేవిధంగా పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కూడా.. పెద్దిరెడ్డికి స్నేహితుడు.
మిగిలిన నియోజకవర్గాల్లో దాదాపు పెద్దిరెడ్డి అనుచరులే చక్రం తిప్పుతున్నారు. మొత్తంగా చూస్తే.. చిత్తూరు అంటేనే రెండు మూడు నియోజకవర్గాలు మినహా(కుప్పం, తిరుపతి వంటివి) అన్ని చోట్లా పెద్దిరెడ్డి అనుచరులో.. స్నేహితులో.. ఆయన బంధువర్గమో.. లేకపోతే ఆయన శిష్యుల్లో చక్రం తిప్పుతున్నారు. అందుకే మంత్రి పేరు చెప్పగానే.. చిత్తూరు మాట ఠక్కున వినిపిస్తుంది.
ఇదిలావుంటే. వచ్చే ఎన్నికలకు సంబంధించి మాత్రం మంత్రిగారి బ్యాచ్‌కు వ్యతిరేకత ఎదురవుతు న్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. పీలేరు నుంచి పలమనేరు వరకు .. కూడా ఎమ్మెల్యేలపై వ్యతిరేకత కనిపిస్తోంది. నిజానికి అలాంటి నియోజకవర్గాల్లో మార్పు కోసం.. మంత్రి పెద్ది రెడ్డి ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ వర్కవుట్ కావడం లేదు. దీంతో ఆయన హవా ఈసారి కొనసాగడం కష్టమనే భావన వ్యక్తమవుతోంది. చంద్రబాబు పర్యటనలు.. మంత్రి టార్గెట్‌గా చేస్తున్న విమర్శలు వంటి వి ప్రజల్లో చర్చకు వస్తున్నాయి. మరి పెద్దిరెడ్డి ఎలా ముందుకు సాగుతారో చూడాలి.