పాలన లేదు
అభివృద్ధి లేదు
అడవులు నరికి గనులు తవ్వడం
పేదల ఇళ్ల పేరిట అధిక ధరలకు భూమి కొని స్కాము చేయడం
ఎదురితిరిగిన వాడిని పోలీస్ స్టేషనుకు తీసుకెళ్లడం
ప్రశ్నించిన వాడిని తిట్టడం…
2.5 సంవత్సరాల కాలంలో జగన్ పరిపాలన ఇలానే సాగుతుంది.
రోడ్లు లేక నడ్డి విరుగుతోంది, ధరలు పెరిగి జేబులు ఖాళీ అవుతున్నాయి. కల్తీ మందు తాగి లివర్లు పోతున్నాయి.
కానీ వైసీపీ నేతల జేబులు, మొహాలు మాత్రం కళకళలాడుతున్నాయి.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి చోటు లేకుండా పోయింది.
ఇంతకాలం ప్రజల తరఫున ప్రశ్నించిన మీడియాపై నింద తోసి అవన్నీ అబద్ధాలు అన్నారు. ఇపుడు వైసీపీ ఏం చేస్తుందో ప్రజలందరికీ క్లారిటీ వచ్చేసింది. అందుకే నిందలు వేసి బతికే కాలం పోయింది.
ఈ అవకాశాన్ని పవన్ కళ్యాణ్ సరిగ్గా అర్థం చేసుకున్నారు.
సరైన సమయంలో వైసీపీ పై తిరగబడ్డారు. అది కూడా ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు.
పనికిమాలిన సన్నాసులు, పనికిమాలిన పాలన అంటూ మొన్న సినీ వేదిక నుంచి దాడి చేసిన పవన్ తాజాగా ట్వీట్ల ద్వారా ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేసి కార్యకర్తల్లో అగ్రెసివ్ నెస్ ని నింపుతున్నారు.
వచ్చే అక్టోబరు 2వ తేదీ నుంచి నేరుగా రంగంలోకి దిగుతున్న పవన్ ‘‘ఈ కుక్కలను బయటకు వదిలింది ఎవరు‘‘ అంటూ వైసీపీ నేతలను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ ప్రభుత్వం 'పాలసీ ఉగ్రవాదం' కి అన్నీ రంగాలు అన్ని వర్గాలు నాశనం అయిపోతున్నాయి. దీనిని ఎదుర్కోవలిసిన సమయం ఆసన్నమయింది..
— Pawan Kalyan (@PawanKalyan) September 28, 2021
తాజాగా వైసీపీ పాలనను పాలసీ ఉగ్రవాదంగా వ్యాఖ్యానిస్తూ మరింత రాజకీయ వేడిని పుట్టించారు పవన్ కళ్యాణ్. ప్రభుత్వంపై తీవ్ర పోరాటానికి జనసేనను సిద్ధం చేస్తున్నట్లే కనిపిస్తోంది పవన్ తీరు.