వైసీపీ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూను కల్తీ చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపణ చేయటం పెను సంచలనం రేపిన సంగతి తెలిసిందే. లడ్డూ వివాదం నేపథ్యంలో మాజీ సీఎం జగన్ రెడ్డి తిరుమల పర్యటనకు రెడీ అవ్వగా.. ఆలయ సంప్రదాయం ప్రకారం డిక్లరేషన్ ఇస్తేనే శ్రీవారి దర్శనానికి అనుమతి ఇవ్వాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశారు. డిక్లరేషన్ కు ఇచ్చేందుకు ఒప్పుకోని జగన్.. తిరుమల టూర్‌ను క్యాన్సిల్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఇదే డిక్లరేషన్ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఇరకాటంలో పెట్టాలని వైసీపీ నేతల ప్లాన్స్ వేశారు. కానీ చివరకు వారి ప్లాన్స్ బెడిసి కొట్టాయి.
లడ్డూ కల్తీ కారణంగా పవన్ కళ్యాణ్ గత నెల 22న ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన సంగతి విధితమే. 11 రోజుల దీక్ష అనంతరం బుధవారం ఉదయం తిరుమలలో దీక్షను విరమించారు. ఇందుకోసం మంగళవారమే అలిపిరి మెట్ల మార్గం గుండా సామాన్య భక్తులతో కలిసి కాలినడకన తిరుమల కొండ పైకి చేరుకున్నారు. పవన్‌తో పాటు ఆయన ఇద్దరు కూతుళ్లు కూడా తిరుమలకు వచ్చారు. రాత్రికి తిరుమలలోనే బస చేసిన డిప్యూటీ సీఎం.. బుధవారం ఉదయం ఆద్య మరియు పలీనా అంజనిలతో కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు.
అయితే అన్నా లెజినోవా కూతురు పలీనా అంజని క్రిస్టియన్. దాంతో ఆమె చేత డిక్లరేషన్ ఇప్పించకపోతే ఎలాగైనా రచ్చ చేయాలని వైసీపీ నేతలు అలర్ట్ అయ్యారు. కానీ పవన్ మాత్రం వారికి ఆ ఛాన్స్ ఇవ్వలేదు. తన చిన్న కుమార్తె పలీనా అంజనితో తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ ఇప్పించారు. టిటిడి ఉద్యోగులు తీసుకువచ్చిన డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. పలీనా అంజని మైనర్ అయినందున తండ్రిగా పవన్ కళ్యాణ్ కూడా ఆ పత్రాలపై సంతకాలు చేసి వైసీపీ నేతలను డీలా పరిచారు. కాగా, పవన్ కళ్యాణ్ తన ఇద్దరు కూతుళ్లతో దిగిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. అంజని ఫస్ట్ టైమ్ బయట కనిపించడంతో.. ఆమె ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి చిన్న కుమార్తె పలీనా అంజని కొణిదెల తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చారు. టిటిడి ఉద్యోగులు తీసుకువచ్చిన డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. పలీనా అంజని మైనర్ అయినందున తండ్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ పత్రాలపై సంతకాలు చేశారు.… pic.twitter.com/Lg8zUEfl6l
— JanaSena Party (@JanaSenaParty) October 2, 2024