• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

మ‌హేష్ సినిమానే న‌న్ను ముంచేసింది.. శ్రీను వైట్ల

admin by admin
October 2, 2024
in Movies, Trending
0
0
SHARES
101
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

శ్రీను వైట్ల.. తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో టాప్ డైరెక్ట‌ర్ గా ఓ వెలుగు వెలిగిన వారులో ఒక‌రు. నీ కోసం మూవీతో డైరెక్ట‌ర్ గా మారిన శ్రీను వైట్ల‌.. సొంతం, వెంకీ, ఢీ, దుబాయ్ శీను, దూకుడు వంటి చిత్రాల‌తో భారీ స్టార్డ‌మ్ సంపాదించుకున్నారు. టాలీవుడ్ టాప్ స్టార్స్ కు మోస్ట్ వాంటెడ్ గా మారారు. కానీ త‌ర్వాతి కాలంలో వ‌రుస ప‌రాజ‌యాల కార‌ణంగా శ్రీ‌ను వైట్ల త‌న ఫామ్ ను కోల్పోయారు. 2018 త‌ర్వాత శ్రీ‌ను వైట్ల నుంచి మ‌రో సినిమా రాలేదు.

సుమారు ఐదేళ్ల గ్యాప్ అనంత‌రం శ్రీ‌ను వైట్ల తెర‌కెక్కించిన చిత్రం `విశ్వం`. ఇందులో టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, కావ్యా థాపర్ జంట‌గా న‌టించారు. యాక్ష‌న్ అండ్ కామెడీ ఎంట‌ర్టైన‌ర్ గా రూపుదిద్దుకున్న విశ్వం అక్టోబ‌ర్ 11న థియేట‌ర్స్ లో సంద‌డి చేయ‌బోతోంది. ప్ర‌మోష‌న్స్ లో భాగంగా డైరెక్ట‌ర్ శ్రీ‌ను వైట్ల తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నారు. విశ్వం మూవీ విశేషాల‌తో పాటు ప‌లు ప‌ర్స‌న‌ల్ విష‌యాలు కూడా పంచుకున్నారు.

ముఖ్యంగా మ‌హేష్ బాబుతో తీసిన ఆగ‌డు సినిమానే త‌న‌ను ముంచేసింద‌ని శ్రీ‌ను వైట్ల అభిప్రాయ‌ప‌డ్డారు. దూకుడు వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ అనంత‌రం శ్రీ‌ను వైట్ల‌, మ‌హేష్ కాంబోలో వ‌చ్చిన రెండో చిత్ర‌మే ఆగ‌డు. 2014లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా బోల్తా ప‌డింది. ఆగ‌డుతోనే శ్రీ‌ను వైట్ల కెరీర్ డౌన్ ఫాల్ అవ్వ‌డం స్టార్ట్ అయింది.

తాజా ఇంట‌ర్వ్యూలో శ్రీ‌ను వైట్ల మాట్లాడుతూ.. `నా కెరీర్ లో నేను చేసిన పెద్ద‌ పొరపాటు ఏదైనా ఉందంటే అది ఆగడు చేయడమే. వాస్త‌వానికి మేము మొద‌ట‌ అనుకున్న కథ వేరు. అయితే ఆ స్థాయి కథ నిర్మాతలకు మరింత భారమవుతుందని భావించి, వేరే స్టోరీని అనుకుని సినిమా చేశాం. కానీ దూకుడు హిట్ తో ప్రేక్ష‌కుల్లో అంచనాలు భారీ పెరిగాయి. ఆ అంచ‌నాల‌ను ఈ కథ అందుకోలేకపోయింది. నాకు నేనుగా తీసుకున్న గొయ్యి అది` అంటూ చెప్పుకొచ్చారు. ఆగ‌డు వ‌ల్లే ఆ కెరీర్ పోయింద‌ని శ్రీ‌ను వైట్ల కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. ఇక త‌న రాబోయే చిత్రం విశ్వం త‌ప్ప‌కుండా హిట్ అవుతుంద‌ని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు. గోపీచంద్ మార్క్ యాక్షన్ తో పాటు, నా మార్క్ కామెడీ టచ్ ఉంటుంద‌ని.. సినిమా చూసి ఆడియెన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తార‌ని శ్రీ‌ను వైట్ల పేర్కొన్నారు.

Tags: Aagadu MovieDirector Srinu VaitlagopichandLatest newsmahesh babuSrinu vaitlaTelugu NewsTollywoodVishwamVishwam Movie
Previous Post

సుప్రీం కోర్టు వ్యాఖ్యలపై స్పందించిన పవన్

Next Post

బెడిసి కొట్టిన వైసీపీ ప్లాన్స్‌.. ఇద్ద‌రు కూతుళ్ల‌తో తిరుమ‌ల‌కు ప‌వ‌న్‌

Related Posts

Movies

ఏంటీ.. కాలేజ్ డేస్ నుంచే మ‌హేష్ – త్రిష ఫ్రెండ్సా?

May 13, 2025
modi
India

పాక్ కు మోదీ డెడ్లీ వార్నింగ్

May 12, 2025
Movies

ర‌వితేజ `భ‌ద్ర‌` కు 20 ఏళ్లు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్‌ను రిజెక్ట్ చేసిన హీరోలెవ‌రు?

May 12, 2025
India

కోహ్లి రిటైర్మెంట్ వెనుక కార‌ణ‌మేంటి.. వ‌చ్చే పెన్ష‌న్ ఎంత‌?

May 12, 2025
Movies

నాన్న చ‌నిపోయిన న‌వ్వుతూనే.. ఆ రోజు న‌ర‌కం చూశా: స‌మంత‌

May 12, 2025
Andhra

జగన్ జే బ్రాండ్ మద్యంతో జనాల లివర్ కు చిల్లు..ఇదే ప్రూఫ్

May 11, 2025
Load More
Next Post

బెడిసి కొట్టిన వైసీపీ ప్లాన్స్‌.. ఇద్ద‌రు కూతుళ్ల‌తో తిరుమ‌ల‌కు ప‌వ‌న్‌

Latest News

  • చావు కబురు చల్లగా చెప్పిన పాక్
  • ఏంటీ.. కాలేజ్ డేస్ నుంచే మ‌హేష్ – త్రిష ఫ్రెండ్సా?
  • ఏపీ లిక్క‌ర్ స్కామ్ కేసులో కీల‌క మ‌లుపు.. మ‌రో వ్య‌క్తి అరెస్ట్..!
  • టీడీపీలో దేవినేని త్యాగానికి త‌గ్గ ఫ‌లితం ద‌క్కేదెప్పుడు..?
  • కేశినేని నాని యూట‌ర్న్‌.. చేరేది ఆ పార్టీలోనేనా..?
  • మే 17న ఐపీఎల్‌ పునఃప్రారంభం.. ఫైన‌ల్ మ్యాచ్ ఆ రోజే..!
  • పాక్ కు మోదీ డెడ్లీ వార్నింగ్
  • తిరుమలకు వెళ్తున్నారా? ఈ విలువైన సమాచారం మీ కోసమే!
  • యుద్ధం అంటే.. సినిమా అనుకున్నారా?: ఆర్మీ మాజీ చీఫ్‌ ఫైర్‌
  • ర‌వితేజ `భ‌ద్ర‌` కు 20 ఏళ్లు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్‌ను రిజెక్ట్ చేసిన హీరోలెవ‌రు?
  • కోహ్లి రిటైర్మెంట్ వెనుక కార‌ణ‌మేంటి.. వ‌చ్చే పెన్ష‌న్ ఎంత‌?
  • టెస్ట్ క్రికెట్ కు కోహ్లీ గుడ్ బై
  • ఎమ్మెల్యే వ‌ర్సెస్ లేడీ ఎంపీ.. నంద్యాల టీడీపీలో ఏం జ‌రుగుతుంది?
  • నాన్న చ‌నిపోయిన న‌వ్వుతూనే.. ఆ రోజు న‌ర‌కం చూశా: స‌మంత‌
  • APNRTS ఛైర్మన్ గా డా.రవి వేమూరు
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra