పవర్ స్టార్ పవన్‌కల్యాణ్.. థియేటర్లో తెరపై ఈ పేరు కనపడితే ఎలా ఉంటుందో మనకు తెలుసు. కొందరు తెరకు హారతులు ఇచ్చేస్తారు. మరికొందరు విజిల్స్ వేస్తూ కాగితాలు విసిరేస్తారు. వేరకొరు సెల్ఫీ తీసుకోవటానికి ప్రయత్నిస్తూంటారు. ఇలాంటి ఫ్యాన్ మూమెంట్స్ ఎక్కువగా బెనిఫిట్ షోలలోనే జరుగుతూంటాయి.
ఇలా పవన్ పేరు చూసి ఈలలు వేయడం కోసం అభిమానులు మూడేళ్లుగా ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులకు సరైన సమాధానం చెప్పేందుకు ఏప్రిల్ 9న అంటే ఈ రోజు ఆయన ‘వకీల్‌సాబ్’గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కమర్షియల్ హంగులకు దూరంగా మహిళా సాధికారతే ప్రధానాంశంగా తెరకెక్కిన ‘పింక్’కు రీమేక్‌గా ఈ సినిమా వచ్చింది.
బెనిపిట్ షోకే సూపర్ హిట్ రావటంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఈ వార్తలన్నీ వింటున్న ఇప్పటికి సినిమా చూడని అభిమానులు ఈ రోజే ఎలాగైనా సినిమా చూసేయ్యాలని ఫిక్స్ అయ్యిపోతున్నారు. ఈ నేపధ్యంలో కొన్ని చిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
ఈ సినిమా బెనిఫిట్ షో వెయ్యాలంటూ…పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు ఇంటి ఎదుట పవన్ కల్యాణ్ అభిమానులు ఆందోళనకు దిగటం వార్తల్లో నిలిచింది. అక్కడ జరిగిందేమిటంటే..వకీల్ సాబ్ సినిమాకోసం అభిమానులు బెనిఫిట్ షో టికెట్లు కొన్నారు. కానీ, థియేటర్లో బెనిఫిట్ షో వేయలేదు.
దాంతో అభిమానులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే ఆదేశంతో అధికారులు బెనిఫిట్ షో వేయడంతో పవన్ అభిమానులు ఆందోళన విరమించారు. ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపి బెనిఫిట్ షోకు పరుగులు తీశారు. ఇది ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది.
ఇక ఈ సినిమా విషయానికి వస్తే… పవన్ ఇంట్రడక్షన్, ఇంట్రవెల్, సెకండాఫ్ లో ప్రకాశ్‌రాజ్,పవన్ కళ్యాణ్ మధ్య కోర్టు రూమ్‌లో జరిగే మాటల యుద్ధం చూసి ప్రేక్షకులు ఇప్పటికే ఈలలు వేస్తున్నారు. ఇక ఇందులో మొత్తం నాలుగు పాటలు ఉన్నాయి. బోనీకపూర్ సమర్పణలో దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. నివేదా థామస్, అనన్య, అంజలి కీలకపాత్రల్లో కనిపించనున్నారు. అలాగే ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్ కీలక పాత్ర పోషించారు.
#VakeelSaab సినిమా కి బెనిఫిట్ షోలు వెయ్యకుండా రాత్రికీ రాత్రికి ప్రభుత్వం తీసుకొచ్చిన అక్రమ జీవోకి నిరసనగా నిడదవోలు వైసిపి ఎమ్మెల్యే ఇంటి ముందు #PawanKalyan గారి అభిమానులు నిరసన..#BlockBusterVakeelSaab pic.twitter.com/ixX7GnINc4
— Shruti_Kalyan (@Shruti_Kalyan) April 9, 2021