సినీ రంగంలో ఉన్న వారి ప్రైవసీ గురించి ఇటు మీడియా కానీ.. అటు సోషల్ మీడియా కానీ పెద్దగా పట్టించుకోదు. ఎక్కువ ఆలోచించదు. అందులోనూ ఇబ్బడిముబ్బడిగా మీడియా పెరిగిపోయి.. యూట్యూబ్ ఛానెళ్లు కుప్పలు కుప్పలుగా పుట్టుకొచ్చేయడంతో నెటిజన్లను ఆకర్షించడానికి వాటిలో ఎంత దారుణమైన రాతలు రాస్తారో, ఎలాంటి వీడియోలు పెడతారో.. ఎంత ఘోరంగా ఎడిటింగ్లు చేస్తారో తెలిసిందే.
ఇలాంటి వాటిని పట్టించుకుంటే ఒక బాధ.. పట్టించుకోకుండా ఇంకో బాధ. ఐతే ఇదొక సముద్రం లాంటిది కాబట్టి పట్టించుకోకుండా వదిలేయడమే బెటర్ అన్నది మెజారిటీ అభిప్రాయం. అందులోనూ తమ వ్యక్తిగత జీవితాలకు సంబంధించి వివాదాల్లో ఉండి, సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఇలాంటి విషయాల్లో లైట్ తీసుకుంటే బెటరేమో. కానీ సీనియర్ నటుడు నరేష్, కొన్నేళ్లుగా ఆయనతో కలిసి సాగుతున్న కన్నడ నటి పవిత్ర మాత్రం సోషల్ మీడియాపై యుద్ధానికి సిద్ధమైపోయారు.
తమ గురించి రకరకాల ప్రచారాలు చేస్తూ.. మార్ఫ్డ్ ఫొటోలు, వీడియోలు పెడుతూ వెబ్ సైట్లు, యూట్యూబ్ ఛానెళ్లు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని.. తమ ప్రైవసీకి భంగం కలిగిస్తున్నాయని నరేష్-పవిత్ర హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో తమ గురించి జరుగుతున్న ట్రోల్స్ గురించి కూడా వారు ప్రస్తావించడం గమనార్హం.
ఐతే నరేష్ వ్యక్తిగత జీవితం గురించి ఇప్పటికే మీడియాలో, సోషల్ మీడియాలో చాలా రచ్చే జరిగింది. తనకు విడాకులు ఇవ్వకుండా పవిత్రతో ఉంటుండడంపై ఆయన భార్య ఎంత గొడవ చేసిందో తెలిసిందే. ఈ వివాదం తెగే వరకు నరేష్ కొంచెం సంయమనంతో ఉండకుండా.. ఇటీవల కృష్ణ మరణించినపుడు అక్కడికి పవిత్రను తీసుకొచ్చి కొంచెెం హడావుడి చేయడం చర్చనీయాంశం అయింది.
ఆ విషయంలోనే సోషల్ మీడియాలో చాలా ట్రోలింగ్ నడిచింది. ఇక యూట్యూబ్ ఛానెళ్లయితే ఈ విషయం మీద బోలెడంత మసాలా వీడియోలు పెట్టేశాయి. ఐతే ఇలాంటివి పట్టించుకోకుండా వదిలేస్తే బెటర్ తప్ప.. ఇంకా కేసులు, ఫిర్యాదులు అని కెలుక్కుంటే ఇంకా పెద్ద రచ్చ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సైబర్ క్రైమ్ అధికారులను ఆశ్రయించిన పవిత్ర లోకేశ్ | Pavitra Met Cyber Crime | Prime9 News#cybercrime #pavitralokesh #TeluguNews #prime9news pic.twitter.com/g42Jqgaj4e
— Prime9News (@prime9news) November 26, 2022