అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న బే ఏరియాలో తెలుగు వారి ఆరాధ్య దైవం, తెలుగు తెర కృష్ణుడు, వెండితెర రాముడు తెలుగింటి అన్నగారు నందమూరి తారక రామారావు గారి శత జయంతి వేడుక అత్యంత ఘనంగా జరిగింది.
మే 19, శుక్రవారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో తెలుగువారు హాజరయ్యారు.
ఈ కార్యక్రమాన్ని ‘బే ఏరియా గళం’ గా పిలవబడే ‘శ్రీమతి విజయ ఆసూరి’ ఆసాంతం ఎంతో ఉల్లాసంగా నడిపించారు.
రాజకీయాలకు అతీతంగా, ఒక తెలుగు నాయకుడు, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని దశ దిశలా చాటిన ఎన్టీఆర్ను స్మరించుకునే కార్యక్రమం కావడంతో, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి ‘జస్టిస్ ఇవి వేణుగోపాల్’ ప్రధానోపన్యాసం చేశారు.
తెలుగు వారి వెలుగు దీప్తి అన్న గారు: ‘జస్టిస్ ఇవి వేణు గోపాల్’
తెలుగు వారి వెలుగు దీప్తి నందమూరి తారక రామారావు గారు అని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి ‘జస్టిస్ ఇవి వేణుగోపాల్‘ కొనియాడారు.
ఎన్టీఆర్ శత జయంతిని ఘనంగా జరుపుకోవడం, ప్రతి తెలుగు వారికీ గర్వకారణమన్నారు.
ఎన్టీ రామారావు గారు తెలుగు వారిగా జన్మించడం మనందరి కీ గర్వకారణమన్నారు.
తెలుగు వారిని అవమానిస్తున్న తీరును భరించలేక, తెలుగు వారి ఆత్మగౌరవ ప్రతీకను దశ దిశలా చాటుతూ ఎన్టీ రామారావు గారు తెలుగు దేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలల వ్యవధిలోనే పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారని తెలిపారు.
రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వ హక్కును అమలు చేసి చూపించారని చెప్పారు.
ప్రతి పేదవానికి కిలో రెండు రూపాయలకే బియ్యం ఇచ్చి వారి ఆకలి తీర్చిన ఘనత అన్న గారికే దక్కిందన్నారు
ఎన్టీఆర్ మనిషి కాదని, మనిషి రూపంలో జన్మించిన పుణ్య పురుషులని తెలిపారు.
మద్రాసు రాష్ట్రంలో తెలుగు వారికి తీవ్ర అవమానాలు ఎదురయ్యేవని, అలాంటి పరిస్థితిని ఎన్టీఆర్ మార్చారని చెప్పారు.
గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలుగు వారికిప్రత్యేక గౌరవం తీసుకువచ్చిన ఘనత ఎన్టీఆర్గారికే దక్కుతుందని చెప్పారు.
అందుకే ఆయనను ప్రతి కుటుంబం ఆయనను పెద్ద కొడుకును చేసుకుని, `అన్నగారు` అని పిలుచుకుంటుందని తెలిపారు.
ప్రతి తెలుగువాని ఇంట్లో అన్నగారి ఫొటో ఉంటుందని చెప్పారు.
అదే విధంగా ప్రతి గ్రామంలో అన్నగారి కాంస్య విగ్రహం ఉంటుందని ఇది ఆయనకు తెలుగు వారు ఇచ్చే గౌరవంగా పేర్కొన్నారు.
మంత్ర ముగ్దుల్ని చేసిన జస్టిస్ వేణుగోపాల్ ప్రసంగానికి ప్రేక్షకులు తమ సీట్ల నుండి లేచి కరతాళ ధ్వనులు చేశారు.
ఆత్మగౌరవాన్ని చాటారు: డాక్టర్ నాగేంద్ర ప్రసాద్
ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తగా పాల్గొన్న దౌత్యకార్యాలయ అధికారి ‘డాక్టర్ నాగేంద్ర ప్రసాద్’ మాట్లాడుతూ, తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని దశదిశలా చాటిన మహనీయుడు నందమూరి తారక రామారావు అని పేర్కొన్నారు.
ఆయన ఎక్కడున్నా తెలుగు వారి కోసం పరితపించారని పేర్కొన్నారు.
తెలుగు వారి ఆత్మాభిమానం కోసం ఇంతగా కష్టపడిన వ్యక్తి మరొకరు లేరని పేర్కొన్నారు.
చిన్నతనంలో అన్న గారి సినిమాలను చూసిన జ్ఞాపకాలని గుర్తు చేసుకొన్నారు
తెలుగు కోసం పరితపించారు: జయరాం కోమటి
తెలుగు నేల కోసం, తెలుగు వారి కోసం పరితపించిన ఏకైక వ్యక్తి, సముజ్వల దీప్తి నందమూరి తారకరామారావు అని ఎన్నారై టీడీపీ కోఆర్డినేటర్ ‘జయరాం కోమటి’ పేర్కొన్నారు.
ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు చేసుకోవడం మనందరి భాగ్యమని ఆయన తెలిపారు.
ప్రతి తెలుగు వ్యక్తీ గర్వపడేలా చేసిన ఏకైక వ్యక్తి ఎన్టీఆరేనని చెప్పారు.గత సంవత్సరం మే 28 నుంచి అమెరికా లో ప్రతి నెలా ఒక నగరంలో 12 నగరాలలో పుట్టిన రోజు వేడుకలు జరిగాయి.
ప్రపంచ వ్యాప్తంగా 100 నగరాలలో పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి.
నాకు తెలిసినంత వరకు ప్రపంచ చరిత్ర లో ఇదే మొదటి సారి అన్నారు.
అతి తక్కువ టైం లో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.
మిల్ పిటాస్ నగర డిప్యూటీ మేయర్ ఎవెలిన్ చువ మే 28వ తేదీని మిల్పిటాస్లో ఎన్ టీ ఆర్ తేదీ గా గుర్తిస్తూ proclamation అందచేస్తూ, ఎన్ టి ఆర్ సేవలను కొనియాడారు.
మిల్పిటాస్ స్కూల్ బోర్డు ట్రస్టీ ‘అను నుక్క’ ప్రసంగించారు.
పార్లమెంట్ సభ్యుడు కింజారపు రామూర్తి నాయుడు డల్లాస్ నుంచి జూమ్ ద్వారా మాట్లాడారు.
స్థానిక నాయకులు ‘రమేష్ తంగెళ్లపల్లి’ తను గతంలో పనిచేసిన సమాచార పౌర సంబంధాల శాఖ లో వృత్తి రీత్యా అన్నగారి తో న్యూస్ బ్రీఫింగ్ మరియు అన్న గారి సందేశం వీడియో రికార్డింగ్ చేసి ప్రసారం చేయటం లో గల సాన్నిహిత్యాన్ని నెమరు వేసుకొన్నారు.
కళ్యాణ్ వీరపనేని, గోకుల్ రసిరాజు, భక్తా భల్ల తదితరులు ప్రసంగించారు.
ఎన్టీఆర్ అభిమాని అయిన ‘శ్రీకాంత్ దొడ్డపనేని’ నిద్రాహారాలు మాని భోజన ఏర్పాట్లని దగ్గర ఉండి పర్యవేక్షించారు.
స్థానిక తెలుగుదేశం నాయకుడు ‘వెంకట్ కోగంటి’ అన్ని ఏర్పాట్లను సమన్వయ పరచి, కార్యక్రమం జయప్రదం కావడానికి కృషి చేశారు.
ఈ కార్యక్రమంలో విలేఖ్య వెనిగళ్ళ, కొర్ర జానకి దేవి, చేతన మారిపూరి, నీలిమ గరికపాటి, అన్నపూర్ణ కొర్ర, విజయ్ గుమ్మడి, వీరు వుప్పల, యం వి రావు, సతీష్ చిలుకూరి, తులసి తుమ్మల, ఆది నారాయణ, చంద్ర గుంటుపల్లి, శ్రీనివాస్ వేముల, శాస్త్రి వెనిగళ్ల, రామ్ తోట, ప్రసాద్ మంగిన, రమేష్ కొండా, రవికిరణ్ ఆలేటి, జోగి నాయుడు, వెంకట్ అడుసుమల్లి, హరి సన్నిధి, వెంకట్ జెట్టి, వెంకట్ గొంప, కోటి బాబు కోటిన, భాస్కర్ అన్నే, శ్రీనివాస వల్లూరిపల్లి, హర్ష యడ్లపాటి, లక్ష్మణ్ పరుచూరి, కళ్యాణ్ కోట, స్వరూప్ వాసిరెడ్డి, మధు కందేపి, సాయి యనమదల, పాములు నారాయణ, వినయ్ యలమర్తి, భరణి యాతం, రమేష్ నాయుడు, సుభాష్ ఆర్, రవి ఆలపాటి, సురేష్ రెడ్డి ఉయ్యురు, భరత్ ముప్పిరాళ్ళ, చక్రధర్ అనుమోలు, నరహరి మర్నేని తదితరులు హాజరయ్యారు.
తానా ఎన్నికల ప్రచారంలో భాగంగా బే ఏరియాలో ఉన్న నరేన్ కోడలి మరియు రాజా సూరపనేని కూడా హాజరయ్యారు.
https://www.youtube.com/watch?v=ng6eHXxsm-w&feature=youtu.be