Frontline healthcare workers protesting against 150 years greencard backlog!! @POTUS @VP @RepZoeLofgren @HouseDemocrats @lalitkjha @immivoice @TheH1BGuy @csmikolajuk @pranav_singh_MD @raj_karnatak pic.twitter.com/VLiPxuUVPT
— Frontline Healthcare Workers in Greencard Backlog (@frontline_in) March 17, 2021
ఏపీలో ఏపీ ప్రజలు అనుభవించలేని ప్రజాస్వామ్యాన్ని అమెరికాలో భారతీయులు అనుభవిస్తున్నారు. వైసీపీ సర్కారు వచ్చాక ఎవరికీ నిరసన ప్రదర్శనలకు అనుమతి ఇవ్వరు. ఇచ్చినా నిరసన చేసుకోనివ్వరు. ప్రజలకు ఎంత నొప్పి కలిగినా భరించాల్సిందే. తాజాగా అమెరికాలో జరిగిన ఒక నిరసన చూసి అయినా ఏపీ సర్కారు మనసు మార్చుకోవాలి.
అమెరికాలో శాశ్వత నివాసానికి గ్రీన్‌కార్డుల మంజూరు కోసం భారత సంతతి వైద్యులు, ఇతర సిబ్బంది గురువారం క్యాపిటల్ భవనం వద్ద నిరసనకు దిగారు. గ్రీన్‌కార్డుల జారీలో అవలంభిస్తున్న దేశాల వారీ పరిమితిని(కంట్రీ క్యాప్) ఎత్తివేయాలని భారతీయులు జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్‌ను కోరారు. ఈ కార్డుల జారీలో జాప్యం వల్ల తాము వేరే చోటుకి, వేరే ఉద్యోగానికి మారకలేకపోతున్నామని వారు ఆవేదన చెందుతూ నిరసన తెలిపారు.
ప్రస్తుతం అమల్లో ఉన్న ఇమ్మిగ్రేషన్ విధానం హెచ్-1బీ వీసాపై అగ్రరాజ్యంలో పనిచేస్తున్న అత్యంత నైపుణ్యం గల భారతీయ ఐటీ నిపుణులపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు వారు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విధానం వల్ల కేవలం 7 శాతం మంది మాత్రమే గ్రీన్‌కార్డులు పొందుతున్నారని వారు తెలిపారు. అందువల్ల ఆయా దేశాలకు విధించిన పరిమితిని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
“మహమ్మారి విజృంభణ సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి కరోనా రోగులకు సేవలు అందిస్తున్నాం. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నాం. మాలో ప్రతి ఒక్కరికీ ఒక్కొ స్టోరీ ఉంది. మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం.” అని ఆందోళనలో పాల్గొన్న వైద్యులు రాజ్ కర్నాటక్, ప్రణవ్ సింగ్ అన్నారు. తాము అమెరికాలోనే శిక్షణ పొంది, ఇక్కడే పనిచేస్తున్నామని పేర్కొన్నారు.