ఎన్నికల ప్రచారంలో ఏం మాట్లాడుతున్నారో కూడా తెలీకుండా మాట్లాడుతున్న కేటీఆర్ ను పట్టుకుని నెటిజన్లు సోషల్ మీడియాలో వాయించేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో కేటీయార్ ఏమంటున్నారంటే మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు చేసిన పొరబాట్లను సరిచేసుకుంటారట. అలాగే విద్యార్ధులతో కూర్చుని జాబ్ క్యాలెండర్ ప్రిపేర్ చేస్తారట. రైతుబంధు పథకం అన్నది కొత్తది కాదు కాబట్టి దీని అమలుకు ఎన్నికల కోడ్ వర్తించదని చెప్పారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి నరేంద్రమోడీని ప్రశ్నించే దమ్ములేదన్నారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇప్పటివరకు చేసిన పొరబాట్లను సవరించుకుంటామని కేటీయార్ చెప్పటమే విచిత్రంగా ఉంది. అంటే పదేళ్ళుగా తమ ప్రభుత్వం చాలా పొరబాట్లను చేసిందని అంగీకరించటమే కదా. మరి పదేళ్ళుగా పొరబాట్లు చేస్తున్న ప్రభుత్వానికి మూడోసారి అధికారం ఇవ్వమని అడిగే హక్కు ఎక్కడుందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టు, బ్యారేజిలో నిర్మాణంలోనే లోపాలున్నట్లు ఇపుడు కేటీయార్ అంగీకరించటాన్ని కూడా నెటిజన్లు ఉతికి ఆరేస్తున్నారు.
అధికారంలోకి రాగానే విద్యార్ధులతో కూర్చుని జాబ్ క్యాలెండర్ ప్రిపేర్ చేస్తామని చెప్పటాన్ని కూడా తప్పుపడుతున్నారు. మూడోసారి అధికారం అప్పగిస్తే జాబ్ క్యాలెండర్ ప్రిపేర్ చేస్తామని చెబుతున్న కేటీయార్ మరి పదేళ్ళు ఏమిచేసారో చెప్పాలని నిలదీస్తున్నారు. భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన ఉద్యోగులు భర్తీ చేయలేదు. ఎన్నికల ముందు మొదలుపెట్టిన భర్తీ కూడా ప్రశ్నపత్రాల లీకేజీతో రద్దుయిపోయాయి. ప్రశ్నపత్రాలు లీకేజీ కాకుండా పరీక్షలను కూడా నిర్వహించలేని ప్రభుత్వం కూడా ఒక ప్రభుత్వమే అనా నెటిజన్లు డైరెక్టుగా వాయించేశారు.
ఎక్కడో పొరబాటు వల్ల ఒక ప్రశ్నపత్రం లీకైందంటే ఏమోలే అనుకోవచ్చు కానీ ప్రతి ప్రశ్నపత్రమూ లేకేజీయేనా అని నెటిజన్లు నిలదీస్తున్నారు. రైతుబంధు పథకం కొత్తది కాదని కాబట్టి ఎన్నికల కోడ్ వర్తించదని ఇపుడు కేటీయార్ చెప్పటమే విచిత్రంగా ఉంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తు మరి రైతుబంధు పథకంలో డబ్బులు వేయటానికి అనుమతి ఇవ్వమని కేంద్ర ఎన్నికల కమీషన్ కు కేసీయార్ ఎందుకు లేఖ రాశారని నిలదీస్తున్నారు. మొత్తానికి కేటీయార్ మాట్లాడిన ప్రతి మాటను పట్టుకుని నెటిజన్లు సోషల్ మీడియాలో వాయించేస్తున్నారు.