నట సింహం నందమూరి బాలకృష్ణ 107 వ సినిమా కోసం సినీ జనాలు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
బాలకృష్ణ (Nandamuri Balakrishna) సెంటిమెంట్లను ఎక్కువ ఫాలో అవుతాడన్న విషయం అందరికీ తెలిసిందే.
తన 107 సినిమాకు కూడా సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారా..? అంటే అవును అని ఇండస్ట్రీ వర్గాలలో టాక్ ప్రస్తుతం వినిపిస్తోంది.
అఖండ టాలీవుడ్ లో ఎంత సంచలనం అయ్యిందో తెలిసిందే. బాలయ్య బోయపాటి కాంబినేషన్ అంటే మామూలుగా ఉండదు.
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాలలోనూ అఖండ (Akhanda)అద్భుతమైన వసూళ్లను రాబట్టింది. దీనిని దృష్టిలో ఉంచుకుని బాలయ్య కొత్త సెంటిమెంటును ఫాలో అవుతున్నాడు.
క్రాక్ (Krack) సినిమాతో హిట్ అందుకున్న దర్శకుడు గోపీచంద్ మలినేని ఇప్పుడు బాలయ్య చేస్తున్న తన 107వ సినిమా (NBK 107)ను కూడా అదే తేదీన రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు ఇప్పుడు టాక్ వినిపిస్తోంది.
107వ సినిమాలో బాలయ్యతో శృతి హాసాన్ హీరోయిన్గా నటిస్తుంది. ముందు దసరా బరిలో దిగాలని బాలయ్య అనుకున్నాడు. కానీ.. గత ఏడాది డిసెంబర్ 2న అఖండ రిలీజై భారీ సక్సెస్ సాధించి ఉండటంతో ఇప్పుడు ఎన్బీకె 107 కూడా ఈ ఏడాది దసరాకి కాకుండా డిసెంబర్ 2నే రిలీజ్ చేయాలని డిసైడ్ చేశారట. మరి అధికారిక ప్రకటన ఎపుడు వస్తుందో చూడాలి.