సీఎం జగన్రెడ్డి బాధితులూ.. వచ్చేయండి.. టీడీపీ ఆహ్వానిస్తోంది! అని టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. తాజాగా తాడేపల్లి మండలం కుంచనపల్లి గ్రామానికి చెందిన వైసిపి నేత, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు గొర్ల వేణు గోపాల్ రెడ్డి సహా పలువురు కార్యకర్తలు పార్టీలో చేరారు.
వారికి పసుపు కండువా కప్పి పార్టీలోకి లోకేష్ ఆహ్వానించారు. అనంతరం లోకేష్ మాట్లాడుతూ.. అందరూ కలిసి రండి దారితప్పిన రాష్ట్రాన్ని గాడిన పెడదామన్నారు. ప్రధాని ముందు ప్యాలస్ పిల్లి మియావ్ మియావ్ అందని ఎద్దేవా చేశారు.
“ప్రధానిని సార్, సార్, సార్ అనడం తప్ప సాధించింది ఏమి లేదు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్, విశాఖ ఉక్కు, కడప స్టీల్ ప్లాంట్ గురించి ఒక్క మాట మాట్లాడలేదు. ఎన్నికల ముందు ఊరంతా తిరిగి ముద్దులు పెట్టాడు. ఇప్పుడు ప్రజల్ని బాదుడే బాదుడుతో రక్తం పీలుస్తున్నాడు. సిఎం నివాసం ఉంటున్న తాడేపల్లి గంజాయి కి అడ్డగా మారింది. సిఎం ఇంటి పక్కన మహిళలకు రక్షణ లేదు. గంజాయి మత్తులో సిఎం ఇంటికి కూత వేటు దూరంలో మృగాళ్లు అత్యాచారాలు చేస్తున్న దుస్థితి నెలకొంది“ అని నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
వేణు గోపాల్ రెడ్డిని, ఆయన అనుచరుల్ని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నానన్నారు. పార్టీలో వేణుగోపాల్ రెడ్డి కి గౌరవం దక్కుతుందని, ఆయనకు సముచిత స్థానం కల్పిస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు. వేణు గోపాల్ రెడ్డి జగన్ మోహన్ రెడ్డి బాధితుడని పేర్కొన్నారు. వేణు గోపాల్ రెడ్డి మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే బాధితుడుగా ఇన్నాళ్లు పనిచేశారని తెలిపారు. 2019 ఎన్నికల్లో వైసిపి ని గెలిపించడానికి ఎంతో మంది వేణు గోపాల్ రెడ్లు త్యాగాలు చేసారని గుర్తు చేశారు.
“జగన్ మోహన్ రెడ్డి గారిని సీఎం చెయ్యడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేణు గోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు ఎంతో కష్ట పడ్డారు. కానీ జరిగింది ఏంటి? బాగుపడింది ఎవరు? నష్టపోయింది ఎవరు? బాగుపడింది కేవలం నలుగురు రెడ్లు మాత్రమే… సజ్జల రామకృష్ణా రెడ్డి, పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి. నష్టపోయింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల మంది వేణుగోపాల్ రెడ్లు. ఆర్థికంగా నష్టపోయారు, కనీస గౌరవం లేదు, మీ వ్యాపారాలు అన్ని దెబ్బతిన్నాయి“ అని ఆందోళన వ్యక్తం చేశారు.
“ఈ వేదికగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జగన్ రెడ్డి బాధితులు వేణుగోపాల్ రెడ్డి లాంటి వాళ్లకు క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నా. టిడిపి అందరి పార్టీ… అందరికి గౌరవం ఇస్తాం… అందరికీ సముచిత స్తానం ఇస్తాం. జగన్ మోహన్ రెడ్డి బాధితులను అందరికి ఒకటే పిలుపు ఇస్తున్నా. మీరంతా తెలుగుదేశం పార్టీ లో చేరండి. రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరంతా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వండి. అందరిని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. రాష్ట్రం బాగుపడాలి అంటే జగన్ గారు పోవాలి… చంద్రబాబు రావాలి. మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆర్కే విధ్వంసం సృష్టిస్తున్నాడు“ అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు.
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి @naralokesh సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన తాడేపల్లి మండలంకి చెందిన వైసిపి నేత గొర్ల వేణు గోపాల్ రెడ్డి, వైసిపి కార్యకర్తలు. pic.twitter.com/agpYFPv1pT
— iTDP Official (@iTDP_Official) November 13, 2022