టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుని నంద్యాలలో సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తన అరెస్టుపై చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేశారు. ఈ కేసులో 37వ పేరు తనదని, ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా తనను అరెస్టు చేయడాన్ని చంద్రబాబు ఖండించారు. తన అరెస్టుకు గల కారణం తెలుసుకునే హక్కు తనకుందని, సరైన ఆధారాలు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారని మండిపడ్డారు. తాను తప్పు చేస్తే నడిరోడ్డుపై ఉరి తీయాలని ఎమోషనల్ అయ్యారు.
ప్రైమా ఫేసీ లేకుండా అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటని పోలీసులను నిలదీశారు. మాజీ సీఎం అయిన తన అరెస్టు కోసం అర్ధరాత్రి రావం అరాచకం అని ధ్వజమెత్తారు. నాలుగున్నరేళ్లుగా ప్రజా సమస్యలపై తాను పోరాడుతున్నానని, అందకే తనను అడ్డుకుంటున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. తప్పు చేస్తే నిరూపించాలని, అక్రమ అరెస్టులు చేయడం ఏంటని మండిపడ్డారు. చివరకు సత్యం, ధర్మం గెలుస్తాయని, ప్రజలు, టిడిపి కార్యకర్తలు, టిడిపి నేతలు సంయమనం పాటించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
అధికారం ఉంది అని తనను అరెస్టు చేశారని, తన ప్రాథమిక హక్కులను కాలరాసినందుకు బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పక్క ప్రణాళిక ప్రకారమే తనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టేందుకు కుట్ర పన్నారని చంద్రబాబు ఆరోపించారు. ఇలా ఎన్ని కుట్రలు చేసినా…ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటానని చంద్రబాబు భావోద్వేగంతో మాట్లాడారు.
ప్రజాస్వామ్యాన్ని నడిరోడ్డుపై హత్యచేశారు. ప్రజా సమస్యలపై పోరాడుతుంటే అడ్డుకుంటున్నారు. నేను తప్పు చేస్తే నిరూపించాలి. చివరకు ధర్మమే గెలుస్తుంది. ప్రజలు, టీడీపీ కార్యకర్తలు సంయమనం పాటించాలి – టీడీపీ అధినేత చంద్రబాబు #WeWillStandWithCBNSir#G20India2023#StopIllegalArrestOfCBN… pic.twitter.com/q2dTW34GwE
— Telugu Desam Party (@JaiTDP) September 9, 2023
తప్పు లేకుండా ఒక్క మంచి మనిషిని అరెస్ట్ చేసావు @ysjagan. దేవుడే నీకు బుద్ధి చెపుతారు #WeWillStandWithCBNSir#G20India2023#StopIllegalArrestOfCBN#PsychoJagan pic.twitter.com/DlzNMK4JIH
— Telugu Desam Party (@JaiTDP) September 9, 2023
సైకో… లండన్ మెంటల్ హాస్పిటల్ నుంచి లైవ్ చూసి, తృప్తి పడుతున్నావా ? పిక్చర్ అభీ బాకీ హై.. గెట్ రెడీ సైకో.. #WeWillStandWithCBNSir#G20India2023#StopIllegalArrestOfCBN#PsychoJagan pic.twitter.com/q9DhEmcQWI
— Telugu Desam Party (@JaiTDP) September 9, 2023