ఇదేంటి? అనుకుంటున్నారా? నిజమే. ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణోత్సవం.. మంత్రి పొన్న ప్రభాకర్ ఆగ్రహంతో.. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి హెచ్చరికల మధ్య ప్రారంభమైంది. దీంతో ఇది కాస్తా.. వివాదంగా మారి వార్తల్లోకి వచ్చింది.
ఏం జరిగింది?
హైదరాబాద్‌లోని ప్రముఖ గ్రామదేవత బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి గురించి అందరికీ తెలిసిందే. బల్కంపేట ప్రధాన రహదారిని ఆనుకుని ఈ ఆలయం ఉంటుంది. ప్రతి ఏటా.. ఆషాఢం ప్రారంభంలో అమ్మవారికి కల్యాణోత్సవాలు నిర్వహిస్తారు. ఈ సారి కూడా.. నిర్వాహకులు ఈ ఏర్పాట్లు చేశారు. అయితే.. మంగళవారం ఉదయం జరిగిన ఈ కల్యాణోత్సవానికి.. మంత్రి పొన్నం ప్రభాకరం, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి హాజరయ్యారు. మరి వీరు వస్తున్నట్టు ముందస్తు సమాచారం ఉందోలేదో.. తెలియదు.
దీంతో అధికారులు ఏర్పాట్లు చేయలేక పోయారు. దీంతో మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొటోకాల్ పాటించడం లేదని నిప్పులు చెరుగుతూ.. ఆలయం బయటే కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. కల్యాణోత్సవానికి ఏర్పాట్లు చేసిన హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్‌పై సీరియస్ అయ్యారు. వీఐపీలు వస్తున్న సమయంలో ఆలయం ఎదుట సరైన సెక్యూరిటీ కూడా లేదని మంత్రి మండిపడ్డారు.
దీంతో ఉలిక్కిపడిన కలెక్టర్ అప్పటికప్పుడు ప్రొటోకాల్ ప్రకారం.. ఏర్పాట్లు చేసేలా చర్యలు తీసుకున్నారు. మంత్రిని, మేయర్‌ను శాంతపరిచారు. అనంతరం మంత్రి, మేయర్లు అమ్మవారిని దర్శించుకు న్నారు. కానీ, చిన్న విషయాన్ని మంత్రి పొన్నం పెద్దది చేశారా? అనే విమర్శలు వినిపిస్తున్నాయి.