ఈ ఏడాది సౌత్ ఇండియాలో సెన్సేషనల్ హిట్లలో లవ్ టుడే ఒకటి. ప్రదీప్ రంగనాథన్ అనే యువ దర్శకుడు తనే లీడ్ రోల్ పోషిస్తూ తమిళంలో రూపొందించిన ఈ యూత్ ఫుల్ లవ్ స్టోరీ యువ ప్రేక్షకులకు విపరీతంగా చేసింది. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయగా ఇక్కడ కూడా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ప్రదీప్ నుంచి కొత్త సినిమా ఏది ఇప్పటిదాకా అనౌన్స్ కాలేదు.
దర్శకుడిగా అతని నుంచి ఎలాంటి సినిమా వస్తుందని ఎదురు చూస్తుండగా.. అతను మాత్రం మెగా ఫోన్ పక్కన పెట్టి హీరోగానే ఇంకో సినిమా చేయబోతున్నాడు. ఆ చిత్రాన్ని నయనతార భర్త విఘ్నేష్ శివన్ రూపొందించనుండటం విశేషం. ఉప్పెన తర్వాత తెలుగులో సరైన బ్రేక్ అందుకో లేకపోయిన కృతి శెట్టి ఈ చిత్రంలో కథానాయకగా నటించబోతోంది. తమిళంలో ఆమె ఇప్పటికే కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. ఇక ప్రస్తుతం సౌత్ ఇండియాలో అత్యంత డిమాండ్ ఉన్న విలన్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎస్.జె.సూర్య ఇందులో ఒక ప్రత్యేక పాత్ర పోషించబోతున్నాడు.
లియో లాంటి భారీ చిత్రాన్ని నిర్మించిన లలిత్ కుమార్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతున్నాడు. నిజానికి విఘ్నేష్ శివన్ తన కొత్త సినిమాను టాప్ స్టార్ అజిత్ కుమార్ తో చేయాల్సింది. కానీ ఆ చిత్రం అనౌన్స్ అయ్యాక అని వారి కారణాలవల్ల ఆగిపోయింది. తర్వాత వేరే స్టార్లను ట్రై చేసి ఫెయిల్ అయిన విఘ్నేష్ చివరికి.. లవ్ టుడే తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రదీప్ రంగనాథన్ తో సినిమా చేయబోతున్నాడు. విఘ్నేష్ తో పాటు కృతి శెట్టికి కూడా ఈ సినిమా సక్సెస్ కావడం చాలా కీలకం. ఈ సినిమా తెలుగులోనూ ఒకేసారి విడుదల కానుంది.