యంగ్ టైగర్ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన `దేవర` బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతోంది. సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ.. కాసుల వర్షం కురిపిస్తోంది. దసరా హాలిడేస్ అడ్వాంటేజ్ తో విడుదలైన వారం రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకున్న దేవర.. తాజాగా 500 కోట్ల క్లబ్ లో చేరి నయా రికార్డు సృష్టించింది.
సోలోగా తారక్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా అగ్రస్థానంలో నిలిచింది. అలాగే రాజమౌళి లేకుండా ప్రభాస్ తర్వాత 500 కోట్ల క్లబ్ లో జాయిన్ అయిన మరో హీరోగా ఎన్టీఆర్ నిలిచాడు. దేవర సక్సెస్ ను చిత్రబృందంతో పాటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇకపోతే దేవర చిత్రంతో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ సౌత్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ప్రతినాయకుడిగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ నటించారు.
కొరటాల శివ డైరెక్ట్ చేసిన దేవరలో ఎన్టీఆర్ తండ్రీకొడుకులుగా దేవర, వర అనే పాత్రలను పోషించాడు. దేవర పార్ట్ 1 సూపర్ సక్సెస్ అవ్వడంతో పార్ట్ 2పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. రెండో భాగానికి సంబంధించిన స్టోరీ, స్క్రిప్ట్ వర్క్ ఆల్రెడీ కంప్లీట్ అయింది. రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది ఆరంభంలో ప్రారంభం కావొచ్చని అంటున్నారు. కాగా, ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ లో వార్ 2 మూవీ చేస్తున్నాడు. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమాకు కమిటై ఉన్నాడు.