ఏపీ సీఎం జగన్ సొంత జిల్లా ఉమ్మడి కడపలోని జమ్మలమడుగులో రాజకీయం రంజుగా మారింది. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ పాగా వేయాలని.. టీడీపీ కంకణం కట్టుకుంది. దీనికి సంబంధించి అనేక ఈక్వేషన్లు పరి శీలించింది. అయితే.. ఈక్వేషన్ల మాట ఎలా ఉన్నా.. టీడీపీ తీసుకున్న నిర్ణయం కాక పుట్టిస్తోంది. దీంతో జమ్మలమడుగు నియోజకవర్గంలో రాజకీయాలు జిల్లా వ్యాప్తంగా ఆసక్తిగా మారాయి.
జమ్మలమడుగు టికెట్‌ను టీడీపీ అధినేత దేవగుడి నారాయణరెడ్డి కుమారుడు భూపేష్‌రెడ్డికి ప్రకటించా రు. కొన్నాళ్ల కిందటే భూపేష్‌పై అనేక రూపాల్లో సర్వేలు చేయించి.. పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. అయి తే. వాస్తవానికి 2014లో వైసీపీ తరఫున గెలిచిన దేవగుడి ఆదినారాయణరెడ్డి(నారాయణరెడ్
అయితే.. వైసీపీ దూకుడుతో.. ఆదినారాయణరెడ్డి ఓటమిపాలయ్యారు. తర్వాత.. ఏంజరిగిందో ఏమో.. ఆది నారాయణరెడ్డి బీజేపీ బాటపట్టారు. అయినప్పటికీ.. ఎన్నికల నాటికి.. అంటే.. మరో పదిమాసాల్లో తిరిగి టీడీపీలోకి వచ్చి జమ్మలమడుగు నుంచి పోటీ చేయాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే, చంద్రబాబు మాత్రం ఆదినారాయణరెడ్డిపైనా సర్వే చేయించి.. ఆయనను కాదని.. తాజాగా భూపేష్‌రెడ్డికి టికెట్ కేటాయించారు. దీంతో యువ నాయకుడు ప్రజల మధ్య జోరుగా తిరుగుతున్నారు.
దీనిని మనసులో పెట్టుకున్న ఆదినారాయణ రెడ్డి సోదరుడి కుమారుడే అయినా.. భూపేష్పైతాను బీజేపీ తరఫున పోటీ చేస్తానని ప్రకటించారు. ఈ పరిణామాలు దేవగుడి కుటుంబానికి మద్దతు దారులుగా ఉన్న వారిని అయోమయానికిగురి చేస్తున్నాయి. వారుఇప్పుడు ఎవర్ని సపోర్ట్ చేయాలో అర్ధంగాక వైసీపీవైపు మళ్లుతున్నారని టాక్. మొత్తంగా ఈ రాజకీయ కుటుంబంలో ఏర్పడ్డ చిచ్చు వైసీపీకి మేలు చేసేలా ఉందని అంటున్నారు పరిశీలకులు.