వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ డర్టీ పిక్చర్ వ్యవహారం కులం రంగు పులుముకున్న సంగతి తెలిసిందే. తన గుట్టు రట్టు చేశారన్న అక్కసుతో కమ్మ సామాజిక వర్గంపై మాధవ్ నోరు పారేసుకున్నారు. అంతేకాదు, తాను బీసీ అని, వెనుకబడిన కురుబ కులానికి చెందిన వాడిని కాబట్టే తనను టార్గెట్ చేశారని కులం పేరు చెప్పి మొసలి కన్నీరు కార్చారు. ఇక, తన న్యూడ్ వీడియో కాల్ వ్యవహారాన్ని పక్కదోవ పట్టించేందుకు తన సామాజిక వర్గం కురుబ నేతలను రంగంలోకి దించారు.
దీంతో, మాధవ్ డర్టీ ఎపిసోడ్ కాస్తా కుల పోరుగా మారింది. ఏపీలో చాలా సంవత్సరాల నుంచి వేళ్లూనుకుపోయిన క్యాస్ట్ పాలిటిక్స్ వైపు మాధవ్ ఎపిసోడ్ మళ్ళింది. ఈ నేపథ్యంలోనే మాట తప్పను మడమ తిప్పను అంటూ జగన్ గతంలో కురుబలకు, బోయలకు, రజకులకు ఇచ్చిన హామీలను సోషల్ మీడియాలో నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. కురుబలను, బోయలను ఎస్టీ జాబితాలో చేరుస్తానని 2017 లో జగన్ ఇచ్చిన హామీలను ఇప్పుడు గుర్తు చేస్తున్నారు.
అంతేకాదు, రజకులను ఎస్సీ జాబితాలో కూడా చేరుస్తానని జగన్ చేసిన వాగ్దానం ఇంకా నెరవేరలేదని నెటిజన్లు విమర్శిస్తున్నారు. అధికార పార్టీ నేతలు కేవలం కులం కార్డు పెట్టుకుని రాజకీయాలు మాత్రమే చేస్తారని, నిజంగా గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చి ఆయా కులాలను అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేయరని నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించి ప్రజలు కుల పోరులకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే గతంలో కురుబలు, బోయలు, రజకులకు జగన్ ఇచ్చిన హామీల తాలూకు ఫోటోలు, పోస్ట్ లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ పోస్ట్..యథాతధంగా…
రాజకీయ కుట్ర అంటే… ఎవడికీ ఇబ్బంది లేదు!
రాజకీయ కక్ష పేరుతో… కులం మీద కక్ష సాధిస్తున్నారు !
కులం కుట్ర పేరుతో… రాజకీయ కుట్రలు చేస్తున్నారు!
మాజీ బూతులమంత్రి అన్నట్టు… ఆయనది పట్టుకుని ఎన్నాళ్ళు వేలాడతాం కానీ !!!
మాట తప్పం- మడమ తిప్పం అన్న వీరో… కురుబ, బోయ కులాలను ఎస్సీ జాబితాలో… రజకులను ఎస్టీ జాబితాలో చేరుస్తానని… అప్పుడు ఇచ్చిన హామీల గురించి పార్టీలతో సంబందం లేకుండా… ఎవరైనా అడిగారా ???
Pic 1:
25 జూలై 2015 లో… బోయలను ఎస్టీల్లో చేరుస్తామని జగన్ అన్నారు !
(ఈయన ప్రస్తుత ముఖ్యమంత్రి)
Pic 2:
08 జనవరై 2017లో… కురుబలను ఎస్టీ జాబితాలో చేర్చాలి – అప్పటి వైసిపి జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ
(ప్రస్తుత ప్రభుత్వంలో… రోడ్లు భవనాల శాఖామంత్రి)
Pic 3:
08 డిసెంబర్ 2017లో… గార్లదిన్నెలో జరిగిన బి.సి సదస్సులో… అధికారంలోకి వచ్చిన వెంటనే… కురుబ మరియు బోయ కులాలను ఎస్టీ జాబితాలో అలాగే రజకులను ఎస్సీ జాబితాలో చేరుస్తామని జగన్మోహన్రెడ్డి వాగ్దానం చేసారు.
(ఈయన ప్రస్తుత ముఖ్యమంత్రి)
ఎన్ని రోజులని… కులం కుట్రలు అంటూ కాలం గడుపుతావు గన్నయ్య??? అధికారం లోకి రావడానికి ఇచ్చిన హామీలు నెరవేర్చే దమ్ము ఉందా లేదా గన్నయ్యా???
#మేలుకోఆంధ్రుడా