ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తో గెలుపు అవకాశాలు సన్నగిల్లాయని తెలిసి గిలాగిలా కొట్టుకున్న వైసీపీ అధినేత వెంటనే తాను తిరుపతికి వస్తున్నట్టు ప్రకటించారు.
స్థానిక ఎన్నికల్లో తాడేపల్లిలో కూర్చుని గెలిపించాను, తిరుపతికి మాత్రం వెళ్లకుండా గెలిపించలేనా అని భావించిన జగన్ గెలుపు అవకాశాలు తగ్గిపోతాయని తెలిసి తాను ప్రచారానికి వెళ్దాం అనుకున్నారు.
ఈ నేపథ్యంలో రెండు కొత్త సందేహాలు ఆయన్ను వేధించడం మొదలుపెట్టాయి. ఒకటి లోకేష్ సవాల్. రెండోది ప్రచారం చేసి కూడా ఓడితే ఏంటి పరిస్థితి అని.
జగన్ నువ్వు తిరుపతికి 14న వస్తున్నావంట… నిజంగా మీ బాబాయిని నువ్వు చంపకపోతే తిరుమల వెంకన్న సన్నిధిలో ప్రమాణం చేయగలవా? అని లోకేష్ సవాల్ విసిరారు. నేను ప్రమాణం చేస్తాను. నువ్వు చేస్తావా? అని లోకేష్ విసిరిన సవాల్ కు జగన్ డిఫెన్స్ లో పడ్డాడు.
ఇక మరో కోణం గెలుపు. ఇంటెలిజెన్స్ రిపోర్టులో గెలుపు అవకాశాలు సన్నగిల్లాయని రావడం ఒకటైతే… ఆ రిపోర్టుకు తగ్గట్టే తెలుగుదేశం సభలకు విపరీతమైన స్పందన కనిపించడం జగన్ ను భయపెట్టింది. దీంతో ప్రచారానికి పోకుంటే పరువైనా మిగులుతుంది అని జగన్ భావించారట. అందుకే పర్యటన రద్దు చేసుకున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం.
https://twitter.com/JaiTDP/status/1380878433463410693