వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ను పశుపతితోనూ.. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబును అరుంధతితో పోలుస్తూ.. టీడీపీ నాయకుడు, యూట్యూబర్ మహాసేన రాజేష్ వ్యాఖ్యలు చేశారు. “పశుపతి వంటి.. జగన్ ను, వైసీపీని, అరుంధతి వంటి చంద్రబాబు బంధించారు. అయినా.. పశుపతి మాత్రం తన ప్రకోపాన్ని మానుకోలేక పోతున్నారు“ అని అన్నారు. తాజాగా రాష్ట్రంలో జరుగుతున్న హత్యలపై ఆయన స్పంది స్తూ.. క్షణాకావేశంలో జరుగుతున్న ఈ ఘర్షణలను, హత్యలను చంద్రబాబుకు ఆపాదించేందుకు ప్రయ త్నిస్తున్నారని విమర్శించారు.
చంద్రబాబు అరుంధతి మాదిరిగా.. వైసీపీని బంధించినా.. అది ప్రేతాత్మగా మారిందని రాజేష్ అన్నారు. ప్రేతాత్మగా మారిన వైసీపీ.. తప్పుడు ప్రచారం చేస్తోందని.. అరుంధతి సినిమాలో పశుపతి అరాచకాలను తట్టుకోలేక ఎలా అయితే బ్రతికి ఉండగానే సమాధి చేశారో.. అలానే జగన్ అరాచకాలను తట్టుకోలేక ప్రజలు.. చంద్రబాబు నేతృత్వంలో జగన్ను వైసీపీని సమాధి చేశారని చెప్పారు. పశుపతి సమాధి నుంచి బయటకు వచ్చేందుకు ఎలా అయితే.. శత విధాలా ప్రయత్నించాడో.. ఇప్పుడు జగన్ కూడా అలానే ప్రయత్నిస్తున్నాడని వ్యాఖ్యానించారు.
ఈ క్రమంలోనే చక్కని ప్రజారంజక పాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వంపై వైసీపీ దుష్ప్రచారాలు చేస్తోందని రాజేష్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో హత్యాచారాలు, హత్యలు, దారుణాలు జరిగిపోతున్నా యంటూ గగ్గోలు పెడుతున్నారని.. కానీ.. వైసీపీ హయాంలో ఏం జరిగిందో నాయకులు, జగన్ కూడా ఆత్మ విమర్శ చేసుకోవాలని రాజేష్ సూచించారు. వైసీపీ పాలనలో ఫోన్ మాట్లాడుకోవాలన్నా భయపడే పరిస్థితి ఉందన్న విషయాన్ని తాను అనేక సందర్భాల్లో చెప్పినా.. తనపైనా దాడులు చేశారని రాజేష్ తెలిపారు.
వైసీపీ హయాంలో పెంచి పోషించిన గంజాయి.. ప్రభావం ఇప్పుడు చూపుతోందని రాజేష్ అన్నారు. అప్పట్లో విచ్చలవిడిగా గంజా సాగు సాగిందని.. ఇప్పుడు ఎక్కడ చూసినా.. గంజాయి లబిస్తోందని.. దీనికి కారణం వైసీపీ నాయకులేనని చెప్పారు. వీటి ప్రభావంతోనే.. మత్తులో కొన్నిదారుణాలు జరుగుతున్నాయ న్నారు. దీనికి కారణం జగన్.. ఆయన పార్టీ నాయకులేనని దుయ్యబట్టారు. ఇంకా ముక్కపచ్చలారని ప్రభుత్వంపై ఎందుకంత ఈర్ష్య అని ప్రశ్నించారు. తప్పుడు ప్రచారం చేసుకునే నిలువునా మునిగిపోయా రని.. ఇప్పుడు కూడా అదే ప్రచారం నమ్ముకున్నారని.. అయినా.. ప్రజలు విశ్వసించే అవకాశం లేదన్నారు.