తప్పు అయినా, ఒప్పు అయినా రాజకీయనాయకుడికి ఒక స్టాండ్ ఉండాలి. కానీ పలువురు బీజేపీ నేతల్లో కొరవడింది అదే. అంతేకాదు, ఏపీలో మాత్రమే కనిపించే విచిత్రం ఏంటంటే… కొందరు తమ గెలుపు గురించి కాకుండా ఇతరుల ఓటమి గురించి పోాారాడుతుంటారు. అలాంటి వారిలో ముద్రగడ పద్మనాభం, ఉండవల్లి అరుణ్ కుమార్, ఐవైఆర్ కృష్ణారావు ముందు వరుసలో ఉంటారు. నవ్యాంధ్ర ఏర్పడ్డాక వీరెపుడు తమ గెలుపు గురించి ఆలోచించింది లేదు, తమ ఓటమి గురించి బాధపడింది లేదు.
వీరి లక్ష్యం ఒకటే… చంద్రబాబు కళ్లలో బాధను చూడటం. దానికి వీరు ఎంచుకున్న మార్గం ఏపీకి నష్టం చేయడం. వీరు టీడీపీని ఏమీ చేయలేరు. ఆ మాటకొస్తే వైసీపీని కూడా ఏమీ చేయలేరు. వీరు ప్రజల కోసం కూడా పోరాడరు. కేవలం చంద్రబాబును డ్యామేజ్ చేయడానికి పనికొచ్చే పనులు మాత్రమే చేస్తారు. ఈ క్రమంలో వారు తమ అసలు బాధ్యతలను కూడా మరిచిపోతారు. దానికి తాజాగా ఉదాహరణగా నిలిచారు ఐవైఆర్ కృష్ణారావు.
జగన్ గారు మీరు కేంద్ర డబ్బులిస్తే తీసుకోండి. ప్రత్యేక హోదా గురించి తర్వాత మాట్లాడదామన్నది ఆయన మాటల్లోని సారాంశం. అసలు ఇంత బోడి సలహా ఈయన ఇవ్వాల్సిన అవసరం ఏంటి… జగన్ చేస్తున్నది అదే. ప్రత్యేక హోదా అనేది అడిగినా రాదని, వచ్చే ఎన్నికల తర్వాత కూడా బీజేపీకి మెజారిటీ రాకపోతేనే అడగగలం అని చేతులెత్తేశారు. ఆయన కేంద్రం ఎంత విదిలిస్తే అంత తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. తీసుకుంటున్నారు. ప్రతి పైసా వాడేసుకుంటారు. కానీ ఐవైఆర్ చెప్పిన విషయం ఎలా ఉందంటే… జగన్ ప్రత్యేక హోదాపోరాటం చేస్తున్నారని, అందులో భాగంగా కేంద్రం ప్రత్యేక హోదా కాకుండా ఏమిచ్చినా ఒక్క రూపాయి అంగీకరించడం లేదన్నట్టుంది. మరి ఆయన సలహా మీనింగ్ అదే. ఈ మాత్ర సలహా ఐవైఆర్ చెప్పాల్నా?
ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే… ఐవైఆర్ కృష్ణారావు ఏపీకి చెందిన బీజేపీ నేత. ఏ రాజకీయ పార్టీ నేత అయినా తన ప్రాంతం కోసం, తన రాష్ట్రం కోసం పోరాడాలి. కానీ ఐవైఆర్ ఏనాడైనా కేంద్రాన్ని మర్యాదపూర్వకంగా అయినా ప్రత్యేక హోదా ఇవ్వండి అని అడిగారా? పోనీ ప్యాకేజీ డబ్బులు సక్రమంగా ఇవ్వండి అని ట్వీట్ వేశారా? మరి ఏపీ నేతగా ఆయనకు బాధ్యత లేదా? ఎందుకీ తప్పుడు విధానం. ఎందుకిలా చేస్తున్నారు ఐవైఆర్.
ఏపీకి రావల్సిన నిధుల కోసం, ఏపీకి రావల్సిన పథకాల కోసం, ఏపీకి రావల్సిన ప్రయోజనాలకోసం ఎందుకు ఐవైఆర్ నిలదీయడం లేదు? ఎందుకంటే ఆయన బీజేపీలో ఉన్నది చంద్రబాబు కళ్లలో బాధచూడటానికి, చంద్రబాబును ఓడించడానికే గానీ ఏపీ ని గెలిపించడానికి కాదు, తనను తాను గెలిపించుకోవడానికి కూడా కాదు.