ఔను! రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఇదే మాట వినిపిస్తోంది. ప్రభుత్వం చెబుతున్న దానికి, క్షేత్రస్థాయిలో జరు గుతున్న దానికి ఎక్కడా పోలిక లేక పోవడంతో కరోనా బాధిత కుటుంబాలు, వ్యక్తులు నానా తిప్పలు పడుతు న్నారు.
రాష్ట్రంలో కరోనా తీవ్రస్థాయిలో ఉన్న నేపథ్యంలో ఆసుపత్రుల్లో బెడ్ల వివరాలను ప్రభుత్వం ప్రజల కు అందుబాటులో కి తెచ్చినట్టు ముఖ్యమంత్రి జగన్ స్వయంగా ప్రకటించారు.
ఇక, దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసేందుకు మంత్రులు సైతం రంగంలోకి దిగారంటూ.. అటు బొత్స సత్యనారాయణ, ఇటు ఆళ్ల నానిలను పేర్కొన్నారు.
అయితే.. ఇప్పటి వరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్లు పూర్తిగా నిండిపోయాయి. వీటిలోనూ ఆక్సిజన్ బెడ్లు, వెంటిలేటర్ ఉన్న ఐసీయూలు, ఇతరత్రా సౌకర్యాలు ఉన్న బెడ్లు పూర్తిగాఫులయ్యాయి.
దీంతో ప్రజలు ప్రైవే టు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ రోజుకు లక్ష చొప్పున ముందుగానే అడ్వాన్ కింద రూ.5 లక్షలు కట్టించుకుని, ఇక అక్కడి నుంచి రోజుకు ఇంతని వసూలు చేస్తున్నారు.
ఇక, సిటీ స్కాన్ చేస్తే తప్ప చాలా మందిలో కరోనా లక్షణాలు కనిపించడం లేదు. కరోనా.. ఫలితం తెలుసుకు నేందుకు చాలా మంది సీటీ స్కాన్నే ఆశ్రయిస్తున్నారు.
దీంతో ఇక, విచ్చలవిడిగా ప్రైవేటు యాజమాన్యాలు దోపిడీ చేస్తున్నాయని.. కరోనా బాధితులు ఆరోపిస్తు న్నారు. ఈ క్రమంలో ప్రబుత్వం నేరుగా రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ వెబ్సైట్లో రాష్ట్రంలోని జిల్లాల వారీగా.. అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న బెడ్ల వివరానలు నిక్షిప్తం చేసింది.
దీంతో మధ్యతరగతి ప్రజలు ఈ సైట్ను పరిశీలించి.. దీని ప్రకారం బెడ్ల కోసం.. ఆయా ఆసుపత్రులను ఆశ్రయి స్తున్నారు. అయితే.. ప్రభుత్వానికి ప్రైవేటు ఆసుపత్రులు ఇస్తున్న లెక్కలకు, క్షేత్రస్థాయలో బెడ్లు ఉన్న పరిస్థితి చాలా వ్యత్యాసం కనిపిస్తోంది.
అంటే.. ఉదాహరణకు ఒక ఆసుపత్రిలో 15బెడ్లు మాత్రమే ఉన్నాయని.. ప్రభుత్వ వెబ్ సైట్లో పేర్కొంటు న్నారు. కానీ, ఆ ఆసుపత్రిలో నిజానికి 65 బెడ్లు ఉంటున్నాయని. మిగిలిన వాటిని బ్లాక్లో అమ్మేస్తున్నారని .. ఓ మీడియా సంస్థ చేసిన స్టింగ్ ఆపరేషన్ స్పష్టంఅయింది.
దీంతో సీఎం జగన్ చెబుతున్న లెక్కలకు, బయట ఉన్న లెక్కలకు పొంతనలేకుండా పోయిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి .. ఘనత వహించిన జగన్ ప్రభుత్వం ఇప్పటకైనా.. కళ్లు తెరుస్తుందా లేదా? అనేది చూడాలని అంటున్నారు పరిశీలకులు.
ఇక ఇది పక్కన పెడితే ప్రతిదాంట్లో దొంగలెక్కలే.
మరణాల విషయంలో అయితే పచ్చి అబద్ధాలు ఆడుతోంది ప్రభుత్వం అంటున్నా పలువరు.
When it comes to public health, open communication of data is crucial. It is important that COVID related deaths are accurately reported in the interest of transparency and to help people understand the impact of the virus.(1/2)@ArogyaAndhra @ysjagan @AndhraPradeshCM https://t.co/csNDzsjyPR
— Lokesh Nara (@naralokesh) April 27, 2021