నిప్పు లేనిదే పొగ రాదంటారు. చిత్ర పరిశ్రమలో కొన్నిసార్లు నిప్పు లేకున్నా.. పొగ రాజేసి.. లేని ఆలోచనల్ని కలిగించి..నిజంగానే నిప్పును రగిలించే టాలెంట్ ఉన్నోళ్లు బోలెడంత మంది ఉన్నారు.
మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ ను మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేయటం..దీనికి గాడ్ ఫాదర్ టైటిట్ డిసైడ్ చేయటం తెలిసిందే. హీరోయిజాన్ని పీక్స్ కు చూపించే ఈ మూవీని చిరు చేస్తున్నారన్న వెంటనే దీని మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ మూవీలో బాలీవుడ్ భాయ్ సల్మాన్ ఖాన్ నటిస్తున్నారన్న మాట వినిపించింది. దీన్నో పుకారుగానే ఇంతకాలం కొట్టిపారేశారు.
మొదట్లో ఈ సినిమాకు భాయ్ ను సంప్రదించారని.. ఆయన రిజెక్టు చేశారని ప్రచారం జరిగింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. మెగాస్టార్ మూవీ కావటం.. ఆయనే స్వయంగా అడగటంతో సల్మాన్ ఓకే చెప్పినట్లుగా చెబుతున్నారు.
ఈ మూవీ మొత్తం చిరు చుట్టూనే తిరుగుతుంది. కాకుంటే.. కీలక పాత్ర సల్మాన్ ది అవుతుంది. తక్కువ కాల్షీట్లు ఇస్తే సరిపోతుందని చెప్పటంతో పాటు.. ఆయన అవసరాన్ని వివరించి చెప్పటంతో.. తన డేట్స్ ను కాస్త అడ్జెస్ట్ చేసుకొని మరీ ఓకే చెప్పినట్లుగా చెబుతున్నారు.
ఇప్పటికే చిరు నటిస్తున్న ఆచార్య మూవీ షూటింగ్ పూర్తి కావటం.. తాజాగా గాడ్ ఫాదర్ మూవీ మీదనే చిరు తన ఫోకస్ పెట్టారు. ఈ సినిమాను భారీగా.. గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే మలయాళంలోనూ.. తెలుగులోనూ రిలీజ్ అయినప్పటికీ.. రీమేక్ లో కొన్ని మార్పులు చేస్తారని చెబుతున్నారు.
సల్మాన్ ను ఓకే చేయించటం ద్వారా హిందీలో కూడా ఈ మూవీని విడుదల చేయటం ద్వారా.. మెగా చిత్రంగా మార్చాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.
చిరంజీవి సోదరిగా ఈ చిత్రంలో నయనతార ఓకే చెప్పటం.. సత్యదేవ్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం నయన్.. సత్యదేవ్ లు భార్యభర్తలుగా నటించనున్నారు. సత్యదేవ్ పాత్ర నెగిటివ్ రోల్ కావటం తెలిసిందే.
ఇక.. సల్మాన్ పాత్ర విషయానికి వస్తే.. చిరు సోదరుడిగా.. ఒరిజనల్ లో జాయేద్ మషీద్ (కాబోయే సీఎం పాత్రలో) నటిస్తారని చెబుతున్నారు. ఏమైనా.. గాడ్ ఫాదర్ కు సల్మాన్ ఓకే చెప్పటం నిజమైతే.. ఈ సినిమా రేంజ్ భారీగా పెరిగిపోవటం ఖాయమని చెప్పక తప్పదు.