శీలం వెంకటేశ్వరరావు ఏలూరు జిల్లా మెట్టప్రాంత రాజకీయాల్లో టీడీపీ నుంచి 40 ఏళ్లుగా ఒక్కో మెట్టు ఎక్కుతూ రాష్ట్ర స్థాయి పదవికి ఎంపికైన నేత. ఈ 40 ఏళ్లలో ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా టీడీపీని వీడలేదు. ఎంతోమంది సీనియర్ నేతలు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కాడి కిందపడేసినా పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కడా వెనక్కు తగ్గకుండా పోరాటాలు చేసి తమ ప్రాంతంలో పార్టీని నిలబెట్టారు. పోలవరం నియోజకవర్గంలోని టి.నరసాపురం మండలం వీరభద్రవరం శీలం స్వగ్రామం.
బీసీల్లో యాదవ సామాజిక వర్గానికి చెందిన శీలం వెంకటేశ్వరరావు కుటుంబం పార్టీ పుట్టినప్పటి నుంచి రాజకీయం చేస్తూ మంచి పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకుంది. వెలగపాడు పంచాయతీ పరిధిలో 40 ఏళ్ల పాటు రాజకీయంగా తిరుగులేని పట్టు ఈ కుటుంబం సొంతం. టి. నరసాపురం మండలంలో తెలుగుదేశం పార్టీలో నాలుగు దశాబ్దాలుగా రాజకీయం చేస్తూ పార్టీని నిలబెట్టేందుకు తమ వంతుగా కృషి చేశారు.
ఈ కుటుంబంలో శీలం తండ్రి నారాయణతో పాటు శీలం భార్య కూడా ఎన్నో పదవులు అలంకరించారు. శీలం కూడా సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీపీ, సొసైటీ ప్రెసిడెంట్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో పదవులు ఈ కుటుంబ కీర్తి కిరీటంలో అలంకారమయ్యాయి. గత టీడీపీ ప్రభుత్వంలో చివర్లో ఎమ్మెల్సీ పదవి రేసులో చివరి వరకు ఆయనపేరున్నా చివర్లో సమీకరణలు మారి ఆ అదృష్టం చేజారింది.
శీలం వెంకటేశ్వరరావు / కుటుంబం చేపట్టిన పదవులు / రికార్డు విజయాలు :
– 1988 నుంచి 1996 వరకు శీలం వెంకటేశ్వరరావు తండ్రి నారాయణ 8 సంవత్సరాల పాటు కంటిన్యూగా సర్పంచ్‌గా పనిచేశారు. 1988 కంటే ముందు కూడా శీలం నారాయణ ఇక్కడ సర్పంచ్‌గా పనిచేయడం విశేషం.
– 1995లో మల్లుకుంట సొసైటీ చైర్మన్‌గా చిన్న వయస్సులోనే పదవీ బాధ్యతలు చేపట్టిన శీలం 8 ఏళ్ల పాటు అదే పదవిలో ఉంటూ వన్నెతెచ్చారు.
– 2001లో పంచాయతీ ఎన్నికల్లో వెలగపాడు సర్పంచ్‌గా విజయం
– 2006లో వైఎస్. రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మండలంలో టీడీపీ నుంచి పోటీ చేసేందుకు కూడా ఎవ్వరూ ముందుకు రాని టైంలో శీలం టి.నరసాపురం జడ్పీటీసీగా పోటీ చేసి సంచలన విజయం సాధించారు.
– 2013లో మల్లుకుంట సోసైటీ చైర్మన్‌గా రెండోసారి విజయం
– 2014లో రాజు పోతేపల్లి ఎంపీటీసీగా గెలిచి టి.నరసాపురం ఎంపీపీగా పదవీ బాధ్యతల స్వీకారం
శీలం సతీమణి విజయాలు :
– 2006లో సర్పంచ్‌గా విజయం
– 2014లోనూ వెలగపాడు ఎంపీటీసీగా విజయం
ఇవి కాకకుండా వెలగపాడు పంచాయతీకి నలభై ఏళ్లలో జరిగిన ఎన్నికల్లో ఒక టర్మ్ మినహా అన్నిసార్లు శీలం కుటుంబం సభ్యులో లేదా, ఆ కుటుంబ సానుభూతిపరులో విజయం సాధిచడం ఓ రికార్డ్. వెలగపాడు పంచాయతీ అంటే టీడీపీకి తిరుగులేని కంచుకోట.
ప్రతిపక్షంలో పోరాటానికి బాబు గుర్తింపు ఇది…
పార్టీ అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా .. ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా శీలం పోరాటాలు చేసి… పార్టీ తరపున నిలబడడం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా గట్టిపోటీ ఎదుర్కొని విజయం సాధించడం ఆయనకు ఇష్టమైన సవాల్. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గెలిస్తేనే మన సత్తా ఫ్రూవ్ అవుతుంది అన్నదే శీలం థియరీ. 2011 నుంచి 2014 వరకు కూడా శీలం ఉమ్మడి జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి.. జిల్లా స్థాయి పార్టీ కార్యక్రమాలకు టి. నరసాపురం మండలాన్ని కేంద్రంగా చేసి జిల్లా స్థాయిలో ప్రశంసలు పొందారు.
ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో పార్టీ రాష్ట్ర స్థాయిలో ఓడిపోయాక ఏర్పాటైన కమిటీల్లో శీలం పార్టీ కోసం పడిన కష్టం గుర్తించి చంద్రబాబు ఆయనకు రాష్ట్ర కమిటీలో చోటు కల్పించారు. ఈ క్రమంలోనే ఆయన పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. రాష్ట్ర కమిటీలోకి ఎంట్రీ ఇచ్చాక కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ పరిశీలకుడిగా, ప్రస్తుతం కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ పార్టీ పరిశీలకుడిగా కూడా ఉన్నారు.
టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే..
వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావడం స్పష్టంగా కనిపిస్తోన్న నేపథ్యంలో శీలంకు ఈ సారి మరింత గుర్తింపుతో పాటు మరింత కీలకమైన పదవి వస్తుందన్న సంకేతాలు ఉన్నాయి. పార్టీలో సీనియర్ నేత కావడం, పార్టీ కోసం పడిన కష్టం, సామాజిక సమీకరణలు ఇవన్నీ ఆయనకు ఈ సారి ప్లస్ కానున్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చాక శీలం కీలక పదవుల రేసులో ఉండనున్నాడు. డీసీసీబీ చైర్మన్ లేదా జడ్పీ చైర్మన్ లేదా ఇంకా కాలం కలిసొస్తే గతంలో తృటిలో చేజారిన ఎమ్మెల్సీ పదవి అందుకునే అవకాశమూ ఉంది.