ఈ మధ్యకాలంలో ఆస్ట్రాలజర్ వేణు స్వామి పేరు మీడియాలో, సోషల్ మీడియాలో వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. నాగ చైతన్య, సమంతలు విడాకుల వ్యవహారం తర్వాత ఈయన పేరు బాగా వెలుగులోకి వచ్చింది. వారిద్దరూ విడిపోతారని నాలుగేళ్ల క్రితమే తాను చెప్పానని వేణు స్వామి అనడం, అందుకు తగ్గట్లుగా వీడియోలు కూడా ఉండడంతో ఈయన పేరు పాపులర్ అయింది. దీంతో, చై, సామ్ లతో పాటు మరికొందరు సినీ, రాజకీయ ప్రముఖులపై వేణు స్వామి చెప్పిన ప్రిడిక్షన్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
ముఖ్యంగా ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబుల రాజకీయ భవిష్యత్ గురించి కొద్ది రోజుల క్రితం వేణు స్వామి చేసిన కామెంట్లు ఇపుడు హాట్ టాపిక్ గా మారాయి. జగన్ జాతకం ప్రకారం ఆయనను 2022 ఏప్రిల్ 25లోపు టార్గెట్ చేయాలని, అపుడు ఆయన జాతకంలో అష్టమశని నడుస్తోందని అన్నారు.
ఒకవేళ అది దాటితే 2024లో కూడా జగనే సీఎం అని జోస్యం చెప్పారు. 2019లో స్టార్ట్ అయిన ఈ బుధమహర్దశ 17 ఏళ్ల పాటు ఉంటుందని, అంటే 2019 నుంచి 17 ఏళ్లు జగన్ సీఎంగా ఉంటారని అంటున్నారు. మొత్తానికి జగన్ మూడు సార్లు సీఎం అవుతారని వేణు స్వామి జోస్యం చెబుతున్నారు. అయితే, మొత్తం మూడు సార్లు సీఎం అంటే పదిహేనేళ్ల సమయం అని, మిగిలిన రెండేళ్లలో ఆయనకు గండాలున్నాయని చెప్పారు.
ఇక, చంద్రబాబు, లోకేష్ బాబుల జాతకం కూడా వేణు స్వామి చెప్పారు. 2024 వరకూ లోకేష్ కు రాహు మహర్ధశ నడుస్తుందని, చంద్రబాబుకు మరోసారి సీఎం అయ్యే అవకాశం లేదని వేణు స్వామి జోస్యం చెప్పారు. చంద్రబాబు జాతకం ప్రకారం 2022 తరువాత ఆయనకు న్యాయపరమైన చిక్కులు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశముందంటూ వేణు స్వామి చెప్పిన జాతకం, చేసిన షాకింగ్ కామెంట్స్ ఇపుడు చర్చనీయాంశమయ్యాయి.
Comments 1