ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ (APTS ) ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ గారు పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి అమెరికా వెళ్లిన సందర్భంగా అమెరికాలోని న్యూజెర్సీలో మన్నవ మోహనకృష్ణ మిత్రబృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ (APTS ) ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ గారు.
ఈ ఆత్మీయ సమావేశానికి అమెరికా దేశవ్యాప్తంగా మన్నవ మోహనకృష్ణ గారి ఆత్మీయులు, శ్రేయోభిలాషులు, అభిమానులు, ప్రవాసాంధ్రులు భారీగా వేలాది మంది ఆత్మీయ సమావేశంలో పాల్గొని మన్నవ మోహన కృష్ణ గారికి శుభాకాంక్షలు తెలియజేసారు.
ఈ సందర్భంగా మన్నవ మోహన కృష్ణ గారు మాట్లాడుతూ… నా మీద అభిమానంతో అమెరికాలోని అనేకచోట్ల నుంచి వేలాదిమంది ఈ ఆత్మీయ సమావేశానికి వచ్చి నాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు ఇంత మంచి బాధ్యతలు ఇచ్చినందుకు మన్నవ మోహన కృష్ణ గారు వారికి కృతజ్ఞతలు తెలియజేసారు.
తెలుగుదేశం పార్టీ కోసం చేసిన కృషి లో గాని, ప్రజాసేవలో గాని మీరంతా నాకు అందించిన సహకారాన్ని మర్చిపోలేనివని ప్రవాసాంధ్రులతో మన్నవ మోహనకృష్ణ గారు అన్నారు.
నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి అడుగుజాడల్లో నడుస్తూ రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు, నైపుణ్యాలను పెంపొందించే విధంగా అవసరమైన సాంకేతిక సహకారంతో కృషి చేస్తానన్నారు.
రాష్ట్రంలో అన్ని రంగాల్లో టెక్నాలజీ ని మరింత విస్తృత పరచటానికి కృషి చేస్తానన్నారు.
అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలని, యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించాలని మన్నవ మోహనకృష్ణ గారు ప్రవాసాంధ్రులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నిర్వహించినందుకు అమెరికా మన్నవ మోహనకృష్ణ మిత్రబృందానికి APTS ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ గారు ధన్యవాదాలు తెలియచేసారు.