ఏపీ సీఎం జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. అమరాతి ప్రాంత రైతాంగం వేసిన పిటిషన్లపై హైకోర్టులో నేడు(శుక్రవారం) విచారణ జరగనుంది. హైకోర్టువిచారణ షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 2.15 గంటలకు ఈ కేసు విచారణకు రానుంది.. దీంతో ఇప్పుడు ఏం జరుగుతుంది? హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఏమైనా ఇస్తుందా? లేక,, ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పే ఇస్తుందా? ఇలా కాకుండా రైతులకు ఉపశమనం కల్పిస్తుందా? అనేది ఉత్కంఠగా మారింది.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ గోస్వామి, మరో న్యాయమూర్తి జస్టిస్ బాగ్చీ, మరో న్యాయమూర్తి జస్టిస్ జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఈ విచారణ చేపట్టనుంది.
ఉమ్మడి రాష్ట్ర విడిపోయి.. నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత వచ్చిన తొలి ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి మధ్యలో ఉంటుందని, కృష్ణానది వెంబడి నిర్మితమవుతుందని, చారిత్ర క ప్రాంతం కూడా అయినందున అమరావతిని ఎంపికి చేసి.. ప్రపంచస్థాయి రాజధాని నగరాన్ని నిర్మించాలని తలపొశారు.
ఈ క్రమంలో పది వేల కోట్లతో కొన్ని నిర్మాణాలు కూడా సాగాయి.దీనికి అప్పటి ప్రతిపక్షం జగన్ కూడా అసెంబ్లీలో ఓకే చెప్పారు. భూసమీకరణకు కూడా ఆయన అభ్యంతరం పెట్టలేదు. 33 వేల ఎకరాలు కావాలని అన్నారు. అయితే.. గత ఎన్నికల్లో ప్రభుత్వం మారిపోవడంతో జగన్ సర్కారు వచ్చిన నాటి నుంచి అమరావతిపై కత్తి కట్టారు.
ఇది ఒక సామాజిక వర్గాన్ని బలోపేతం చేసేందుకు ఏర్పాటు చేస్తున్నారని.. కొన్నాళ్లు.. చంద్రబాబు అనుచరగణం.. ఇక్కడ రైతులను మోసం చేసి భూములు కొనేసిందని కొన్నాళ్లు యాగీ చేసి.. అమరావతి ననిర్మాణాలను ముందుకు సాగకుండా చేశారు. ఈ క్రమంలోనే ఏకంగా మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చారు.
దీంతో కడుపు మండిన అమరావతి రైతాంగం, మహిళలు, కూలీలు కూడా ఉద్యమ బాట పట్టారు.. జోరుగా సాగుతున్న ఉద్యమంలోనే న్యాయ పోరాటానికి సైతం దిగారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఈ క్రమంలోనే పలు దఫాలు విచారణ జరిగిన తర్వాత.. ఈ విషయంపై ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం.. అన్ని పిటిషన్లను విచారిస్తుందని అప్పట్లో పేర్కొన్న హైకోర్టు.. తాజాగా మరోసారి విచారణ కు సిద్ధమైంది.
అదేసమయంలో హైకోర్టును కర్నూలుకు తరలించేందుకు ఏపీ ప్రభుత్వానికి ఉన్న హక్కులపై కూడా విచారణ జరగనుంది. రాజధాని పరిరక్షణ సమితి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం సహా.. ఇప్పటికే అనేక పార్టీలు కూడా దీనిలో ఇంప్లీడ్ అయి.. తమ అభిప్రాయాలను అఫిడవిట్ల రూపంలో కోర్టుకు తెలిపారు. అన్ని పార్టీలూ.. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని.. వారి వారి అఫిడవిట్లలో స్పష్టంగా పేర్కొన్నాయి. ఈ ననేపథ్యంలో తాజా విచారణకు ఎనలేని ప్రాధాన్యం ఏర్పడింది. మరి ఎలాంటి ఉత్తర్వులు వస్తాయో చూడాలి.