• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

అమ‌రావ‌తిపై తీర్పేంటి?  మూడు రాజ‌ధానుల‌పై హైకోర్టులో నేడు విచార‌ణ‌

ఏపీ సీఎం జ‌గ‌న్ తీసుకున్న మూడు రాజ‌ధానుల నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ.. అమ‌రాతి ప్రాంత రైతాంగం వేసిన పిటిష‌న్ల‌పై హైకోర్టులో నేడు(శుక్ర‌వారం) విచార‌ణ జ‌ర‌గ‌నుంది.

admin by admin
March 26, 2021
in Andhra, Top Stories, Trending
0
0
SHARES
527
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఏపీ సీఎం జ‌గ‌న్ తీసుకున్న మూడు రాజ‌ధానుల నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ.. అమ‌రాతి ప్రాంత రైతాంగం వేసిన పిటిష‌న్ల‌పై హైకోర్టులో నేడు(శుక్ర‌వారం) విచార‌ణ జ‌ర‌గ‌నుంది. హైకోర్టువిచార‌ణ  షెడ్యూల్ ప్ర‌కారం మ‌ధ్యాహ్నం 2.15 గంట‌ల‌కు ఈ కేసు విచార‌ణ‌కు రానుంది.. దీంతో ఇప్పుడు ఏం జ‌రుగుతుంది?  హైకోర్టు మ‌ధ్యంతర ఉత్త‌ర్వులు ఏమైనా ఇస్తుందా?  లేక‌,, ప్ర‌భుత్వానికి అనుకూలంగా తీర్పే ఇస్తుందా?  ఇలా కాకుండా రైతుల‌కు ఉప‌శ‌మ‌నం క‌ల్పిస్తుందా? అనేది ఉత్కంఠ‌గా మారింది.

హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ అరూప్ గోస్వామి, మ‌రో న్యాయ‌మూర్తి జ‌స్టిస్ బాగ్చీ, మ‌రో న్యాయ‌మూర్తి జ‌స్టిస్ జ‌య‌సూర్య‌ల‌‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ విచార‌ణ చేప‌ట్ట‌నుంది.

ఉమ్మ‌డి రాష్ట్ర విడిపోయి.. న‌వ్యాంధ్ర ఏర్ప‌డిన త‌ర్వాత వ‌చ్చిన తొలి ప్ర‌భుత్వంలో అప్ప‌టి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు రాష్ట్రానికి మ‌ధ్య‌లో ఉంటుందని, కృష్ణాన‌ది వెంబ‌డి నిర్మిత‌మ‌వుతుంద‌ని, చారిత్ర క ప్రాంతం కూడా అయినందున అమ‌రావ‌తిని ఎంపికి చేసి.. ప్ర‌పంచ‌స్థాయి రాజ‌ధాని న‌గ‌రాన్ని నిర్మించాల‌ని త‌ల‌పొశారు.

ఈ క్ర‌మంలో ప‌ది వేల కోట్ల‌తో కొన్ని నిర్మాణాలు కూడా సాగాయి.దీనికి అప్ప‌టి ప్ర‌తిప‌క్షం జ‌గ‌న్ కూడా అసెంబ్లీలో ఓకే చెప్పారు. భూస‌మీక‌ర‌ణ‌కు కూడా ఆయ‌న అభ్యంత‌రం పెట్ట‌లేదు. 33 వేల ఎక‌రాలు కావాల‌ని అన్నారు. అయితే.. గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌భుత్వం మారిపోవ‌డంతో జ‌గ‌న్ స‌ర్కారు వ‌చ్చిన నాటి నుంచి అమ‌రావ‌తిపై క‌త్తి క‌ట్టారు.

ఇది ఒక సామాజిక వ‌ర్గాన్ని బ‌లోపేతం చేసేందుకు ఏర్పాటు చేస్తున్నార‌ని.. కొన్నాళ్లు.. చంద్ర‌బాబు అనుచ‌ర‌గ‌ణం.. ఇక్క‌డ రైతుల‌ను మోసం చేసి భూములు కొనేసింద‌ని కొన్నాళ్లు యాగీ చేసి.. అమ‌రావ‌తి న‌నిర్మాణాల‌ను ముందుకు సాగ‌కుండా చేశారు. ఈ క్ర‌మంలోనే ఏకంగా మూడు రాజ‌ధానుల ప్ర‌తిపాద‌న తెచ్చారు.

దీంతో క‌డుపు మండిన అమ‌రావ‌తి రైతాంగం, మ‌హిళ‌లు, కూలీలు కూడా ఉద్య‌మ బాట ప‌ట్టారు.. జోరుగా సాగుతున్న ఉద్య‌మంలోనే న్యాయ పోరాటానికి సైతం దిగారు. మూడు రాజ‌ధానుల‌కు వ్య‌తిరేకంగా హైకోర్టులో పిటిష‌న్లు వేశారు. ఈ క్ర‌మంలోనే ప‌లు ద‌ఫాలు విచార‌ణ జ‌రిగిన త‌ర్వాత‌.. ఈ విష‌యంపై ఇద్ద‌రు న్యాయ‌మూర్తుల‌తో కూడిన ధ‌ర్మాస‌నం.. అన్ని పిటిష‌న్ల‌ను విచారిస్తుంద‌ని అప్ప‌ట్లో పేర్కొన్న హైకోర్టు.. తాజాగా మ‌రోసారి విచార‌ణ కు సిద్ధ‌మైంది.

అదేస‌మ‌యంలో హైకోర్టును క‌ర్నూలుకు త‌ర‌లించేందుకు ఏపీ ప్ర‌భుత్వానికి ఉన్న హ‌క్కుల‌పై కూడా విచార‌ణ  జ‌ర‌గ‌నుంది. రాజ‌ధాని ప‌రిర‌క్ష‌ణ స‌మితి దాఖ‌లు చేసిన ప్ర‌జాప్ర‌యోజ‌న వ్యాజ్యం స‌హా.. ఇప్ప‌టికే అనేక పార్టీలు కూడా దీనిలో ఇంప్లీడ్ అయి.. త‌మ అభిప్రాయాల‌ను అఫిడ‌విట్ల రూపంలో కోర్టుకు తెలిపారు. అన్ని పార్టీలూ.. అమ‌రావ‌తినే రాజ‌ధానిగా కొనసాగించాల‌ని.. వారి వారి అఫిడ‌విట్ల‌లో స్ప‌ష్టంగా పేర్కొన్నాయి.  ఈ న‌నేప‌థ్యంలో తాజా విచార‌ణ‌కు ఎన‌లేని ప్రాధాన్యం ఏర్ప‌డింది. మ‌రి ఎలాంటి ఉత్త‌ర్వులు వ‌స్తాయో చూడాలి.

Tags: AmaravatiandhrapradeshAP CapitalAP High courtGunturkrishnays jagan
Previous Post

త‌ప్పుడు కేసు… `ఆర్కే` రాజ‌కీయంలో `రిమార్క్‌`

Next Post

తిరుపతి బీజేపీ అభ్యర్థికి జగన్ కి సంబంధం ఏంటి?

Related Posts

Andhra

జగన్ కారు కింద నలిగిపోయిన సింగయ్య..వైరల్

June 22, 2025
Movies

`కుబేర‌` విష‌యంలో మాట మార్చిన నాగ్.. ధ‌నుష్ ఫ్యాన్స్ ఫైర్..!

June 22, 2025
Movies

నిహారికకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారా.. బిగ్ బాంబ్ పేల్చిన నాగ‌బాబు!

June 22, 2025
Andhra

మోదీ వల్లే యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు: నారా బ్రాహ్మణి

June 21, 2025
Andhra

మోడీ కామెంట్ల‌పై లోకేష్ రియాక్ష‌న్‌

June 21, 2025
Andhra

యోగాంధ్ర ఖర్చు..జగన్ ను కడిగేసిన బాబు

June 21, 2025
Load More
Next Post

తిరుపతి బీజేపీ అభ్యర్థికి జగన్ కి సంబంధం ఏంటి?

Please login to join discussion

Latest News

  • ఒక్క రోజు పని చేయలేదు.. రూ.26 లక్షల జీతాన్ని తీసుకున్నాడు
  • జగన్ కారు కింద నలిగిపోయిన సింగయ్య..వైరల్
  • `కుబేర‌` విష‌యంలో మాట మార్చిన నాగ్.. ధ‌నుష్ ఫ్యాన్స్ ఫైర్..!
  • నిహారికకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారా.. బిగ్ బాంబ్ పేల్చిన నాగ‌బాబు!
  • మోదీ వల్లే యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు: నారా బ్రాహ్మణి
  • మోడీ కామెంట్ల‌పై లోకేష్ రియాక్ష‌న్‌
  • యోగాంధ్ర ఖర్చు..జగన్ ను కడిగేసిన బాబు
  • చంద్ర‌బాబుతో చ‌ర్చ‌ల‌కు రెడీ: రేవంత్ రెడ్డి
  • జగన్ ‘రింగు’ పై ట్రోలింగు!
  • తమిళనాడు గవర్నర్ రాక్స్‌.. జ‌నాలు షాక్స్‌.. వీడియో వైర‌ల్!
  • `యోగాంధ్ర`పై జ‌గ‌న్ విమ‌ర్శ‌లు.. బాబు స్ట్రాంగ్ కౌంట‌ర్‌..!
  • చంద్ర‌బాబా మ‌జాకా.. ప‌ట్టుబ‌ట్టారు.. రికార్డు కొట్టారు..!
  • `కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?
  • ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!
  • `సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra