ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఇవాలే ఆఖరి రోజు కాగా.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు వైసీపీ ఎమ్మెల్యేల తీరు పట్ల సీరియస్ అయ్యారు. వైసీపీ సభ్యులు శాసనసభకు దొంగల్లా వస్తున్నారు, సంతకాలు పెళ్లి వెళ్లిపోతున్నారు.. ఇది సమంజసం కాదు అంటూ స్పీకర్ మండిపడ్డారు. అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు పెట్టిన సభ్యులు తనకు కనిపించకుండా వెళ్లిపోవడం ఏంటమని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించాడు.
సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ప్రశ్నలు అడగడానికి కూడా వారు సభలో ఉండటం లేదని.. కొందరు తాము అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం చెప్పే జవాబు ఏంటని తెలుసుకోకుండానే వెళ్లిపోతున్నారని స్సీకర్ అయ్యన్నపాత్రుడు ఆరోపణలు చేశారు. ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఇటువంటి చర్యలతో తలవంపులు తేవద్దని.. జనం ఎన్నుకున్న నేతలుగా సభకు హాజరై మాట్లాడవచ్చని స్పీకర్ వైసీపీ నేతలకు హితవు పలికారు.
కాగా, తాటిపర్తి చంద్రశేఖర్, రేగం మత్స్య లింగం, వై బాల నాగిరెడ్డి, విరూపాక్షి, అమరనాధ రెడ్డి, దాసరి సుధ తదితరులు గవర్నర్ ప్రసంగం తరువాత వేర్వేరు రోజుల్లో సంతకాలు చేసి వెళ్లినట్లు స్పీకర్ గుర్తించారు. గురువారం కూడా గవర్నర్ ప్రసంగం తర్వాత వైసీపీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు సంతకాలు చేసి అసెంబ్లీ నుంచి గాయబ్ అయిపోయారు. ఈ నేపథ్యంలోనే ప్రజా ప్రతినిధులుగా ఎన్నికయిన సభ్యులు సగౌరవంగా సభకు రావాలని.. దొంగల్లా వచ్చి సంతకాలు చేసి వెళ్లిపోవాల్సిన అవసరం లేదని స్పీకర్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ప్రస్తుతం వైసీపీ నేతలను ఉద్ధేశించి స్పీకర్ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.