దేశంలోనే మోస్ట్ హ్యాపనింగ్ సిటీగా మారిన హైదరాబాద్ మరో ఘనతను సాధించింది. ప్రైవేటు సెక్టార్ లో ఈ ఏడాది అత్యధిక పర్యాటకులు హోటల్ గదులు బుక్ చేసుకున్న మహానగరంగా హైదరాబాద్ నిలిచింది. దీనికి సంబంధించిన ఆసక్తికర డేటాను పంచుకుంది ఓయో. అదే సమయంలో ఎక్కువ మంది సందర్శించిన రాష్ట్రంగా మాత్రం ఉత్తరప్రదేశ్ నిలిచింది. ఏడాది చివరికి వచ్చేసిన వేళ.. ఓయో తాజాగా ట్రావెలోపీడియా 2023ను విడుదల చేసింది. ఈ నివేదికలో బోలెడన్ని ఆసక్తికర విషయాలున్నాయి.
అత్యధికులు రూంలు బుక్ చేసుకున్న మహానగరంగా హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిస్తే.. తర్వాతి స్థానాల్లో బెంగళూరు.. ఢిల్లీ.. కోల్ కతాలు నిలిచాయి. అదే సమయంలో చిన్న పట్టణాల విషయానికి వస్తే.. యూపీలోని గోరఖ్ పూర్ మొదటి స్థానంలో నిలిస్తే రెండో స్థానంలో పశ్చిమ బెంగాల్ కు చెందిన దిఘా ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో తెలంగాణకు చెందిన వరంగల్.. ఏపీకి చెందిన గుంటూరు పట్టనాలు నిలిచాయి. విశ్రాంతి కోసం ఎంచుకున్న డెస్టినేషన్లలో జయపుర ముందు నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో గోవా.. మైసూరు.. పుదుచ్చేరి ఉన్నాయి.
అత్యధిక బుకింగ్ లు జరిగిన ఆధ్యాత్మిక గ్యమస్థానాల్లో పూరీ ముందుంది. అమ్రత్ సర్.. వారణాసి.. మరిద్వార్ లు నిలిచాయి. అదే సమయంలో దేశ్ ఘర్.. పళని.. గోవర్థన్ లాంటి చోట్ల బుకింగ్ లు జరిగాయి. అత్యధిక హోటల్ గదువు బుక్ చేసుకున్న రాష్ట్రాల జాబితాలో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో నిలవగా.. తర్వాత మహారాష్ట్ర.. తెలంగాణ.. ఏపీలు నిలిచాయి. అత్యధిక బుకింగ్ లు దక్కించుకున్న రోజుగా ఈ ఏడాది సెప్టెంబరు 30 నమోదైంది. అదే సమయంలో 2023 మే అత్యధిక బుకింగ్ లు జరిగిన నెలగా నిలిచింది.