హాట్ యాంకర్ గా జబర్దస్త్ తో కెరీర్ ప్రారంభించిన అనసూయ…ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తన ఇమేజ్ ను పెంచుకుంది. రంగ స్థలం నుంచి పుష్ప వరకు విభిన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రంగమ్మత్తకు…ఫ్యాన్స్ నుంచి ట్రోలర్స్ నుంచి విమర్శలు వస్తుంటాయి. అయితే, వారికి దీటుగా అనసూయ కూడా ఘాటుగానే రిప్లై ఇస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అనసూయ పెట్టిన ఓ పోస్ట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఉమెన్స్ డే రోజు ప్రతి ట్రోలర్, మీమ్ మేకర్ కు సడన్ గా మహిళలకు గౌరవమివ్వాలన్న సంగతి గుర్తొస్తుందని, కానీ, ఆ గౌరవం 24 గంటల్లోనే ముగిసిపోతుందని అనసూయ ట్వీట్ చేసింది. కాబట్టి మహిళలందరికీ… హ్యాపీ ఫూల్స్ డే అంటూ సెటైరికల్ గా ఉమెన్స్ డే విషెస్ చెబుతూ ట్రోలర్స్ నే ట్రోల్ చేసింది. అయితే అనసూయ పోస్ట్ చూసిన కొందరు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఎవరో కొందరు ట్రోల్ చేస్తున్నారని, అందరినీ ఒకే గాటన కట్టడం సరికాదంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో, అనసూయ మరో ట్వీట్ తో విమర్శలు గుప్పించింది.
తనకు మహిళలంతా తర్వాత ధన్యవాదాలు చెప్పాలని, ఎందుకంటే గుమ్మడి కాయ దొంగల్లా భుజాలు తడుముకుంటున్న ఆ ట్రోలర్స్, మీమ్ మేకర్స్ అందరూ తన ట్వీట్ కు కామెంట్ చేస్తున్నారని మరో సెటైర్ వేసింది. కాగా, తాజాగా ‘ఖిలాడి’ సినిమాలో కామెడీ చేసిన ఈ జబర్దస్త్ యాంకర్..’పుష్ప’ పార్ట్ 2లో షూటింగ్ లో పాల్గొనేందుకు రెడీ అవుతోంది. దీంతోపాటు, ఈ బ్యూటీ చేతిలో మరికొన్ని సినిమాలు కూడా ఉన్నాయి.