అవును క్షేత్రస్ధాయిలో జరిగింది చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. మంత్రివర్గం నుండి ఈటల రాజేందర్ ను కేసీయార్ బర్తరఫ్ చేసి అవమానకరంగా బయటకుపంపేశారు. శనివారం ఈటల నుండి వైద్య, ఆరోగ్య శాఖలను తీసేసిన కేసీయార్ మరుసటి రోజే ఏకంగా మంత్రివర్గం నుండి బయటకు పంపేశారు.
ఇక మిగిలింది మాజీమంత్రి భవిష్యత్తే. ఈటల పర్టీలో ఉంటారా ? లేకపోతే పార్టీలో నుండి కూడా తరిమేస్తారా ? అనే చర్చ జోరుగాసాగుతోంది. అయితే పార్టీకి ఈటల రాజీనామా చేశారనే ప్రచారం ఒక్కసారిగా పెరిగిపోయింది.
సరే పార్టీలో నుండి ఈటలే వచ్చేసినా, కేసీయారే తరిమేసినా పెద్ద తేడా ఏమీ ఉండదు రిజల్టు ఒకటే. మరిపుడు ఈటల భవిష్యత్తు ఏమిటి ? ఇక్కడే అందరిలోను ఆసక్తి పెరిగిపోతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తనంతట తానుగా రాజీనామా చేసి మంత్రివర్గం నుండి పక్కకు తప్పుకోవాలని కేసీయార్ వెయిట్ చేసినట్లున్నారు.
ఇదే సమయంలో తనను బర్తరఫ్ చేసి బయటకు పంపేవరకు వెయిట్ చేయలని రాజేంర్ కోరుకున్నట్లే అనిపిస్తోంది. అందుకనే ఇంత అవమానం జరిగినా ఈటల మంత్రిపదవికి రాజీనామా చేయలేదు.
చివరకు రాజేందర్ అనుకున్నట్లుగానే కేసీయారే బర్తరఫ్ చేసి బయటకు పంపేశారు. తనను బర్తరఫ్ చేసి బయటకు పంపేస్తే జనాల్లో సానుభూతి వస్తుందని ఈటల భావిస్తున్నట్లు సమాచారం. ఎందుకంటే తెలంగాణాలోని బలమైన బీసీ సామాజికవర్గం నేతల్లో రాజేందర్ కూడా ఒకరని ప్రచారం జరుగుతోంది.
రాజేందర్ ముందు రెండు ఆప్షన్లున్నాయి. మొదటిదేమో ఏదో పార్టీలో చేరటం. రెండోదేమో సొంతంగా కొత్తపార్టీ పెట్టడం. ఏదోపార్టీలో ఈటల చేరితే కొంతకాలం భవిష్యత్తు బాగానే ఉంటుందని సన్నిహితులు చెబుతున్నారట. అలాగే కొత్తపార్టీ పెట్టాలంటే మాత్రం కాస్త వెనకాముందు ఆలోచించాలి.
ఎందుకంటే కొత్తపార్టీ పెట్టి కేసీయార్ ను ఢీ కొనేంత సత్తా రాజేందర్ కు ఉందా అన్నదే అనుమానం. ఏదేమైనా మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయటం ద్వారా సానుభూతి వస్తుందని, దాన్ని ఏదోరకంగా అడ్వాంటేజ్ తీసుకోవాలని ఈటల ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
మొత్తంమీద కొద్దిరోజులు తెలంగాణాలో రాజకీయంగా హడావుడి అయితే తప్పదనే అనుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే కేసీయార్ వ్యతిరేకులంతా రాజేందర్ కు మద్దతుగా మాట్లాడుతున్నారు. అలాగే మాజీమంత్రిని తమ పార్టీల్లో చేర్చుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలు ప్రయత్నిస్తున్నట్లే అనుమానంగా ఉంది. చూద్దాం చివరకు ఏమి జరుగుతుందో.