వైసీపీ హయాంలో ఆ పార్టీ నేతలు అందిన కాడికి అవినీతి చేసిన సంగతి తెలిసిందే. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతల అవినీతి చిట్టాపై ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలోనే గనుల శాఖ, ఎక్సైజ్ శాఖల్లో జరిగిన అక్రమాలపై సీఐడీ కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతోంది. మద్యం కుంభకోణంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిపై కూడా కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే తాజాగా గతంలో పర్యాటక, క్రీడా శాఖల మంత్రిగా పనిచేసిన రోజాపై కూడా భారీగా అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే రోజా పై టీడీపీ నేత, శాప్ ఛైర్మన్ రవి నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.
రోజా మంత్రిగా ఉన్నప్పుడు ఆడుదాం ఆంధ్రాలో పాటు పలు రకాలు పేద క్రీడాకారుల కోట్లాది రూపాయలను అప్పణంగా దోచుకున్నారని విమర్శలు గుప్పించారు. రోజా అవినీతిపై పూర్తిస్థాయిలో విచారణ జరుగుతుందని, త్వరలో ఆమె జైలుకు వెళ్లడం ఖాయమని రవి నాయుడు జోస్యం చెప్పారు. చెన్నైలో ఉండే రోజాకు ఏపీలో అభివృద్ధి, సంక్షేమం గురించి ఏం తెలుసని మండిపడ్డారు. తిరుపతి జిల్లాలో వైసీపీ నేతలు పగటి వేషగాళ్లలా తయారయ్యారని ఎద్దేవా చేశారు.