జూన్ 20.. మెగా ఫ్యామిలీకి ఈ డేట్ చాలా చాలా స్పెషల్. ఎందుకంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు పెళ్లి జరిగిన 11 ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే రోజు తమ మొదటి బిడ్డకు ఆహ్వానం పలికారు. గత ఏడాది జూన్ 20వ ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ చిన్నారికి క్లిన్ కారా అంటూ నామకరణం చేశారు. నేటికి క్లిన్ కారా జన్మించి ఏడాది పూర్తయింది. చిన్న యువరాణి ఫస్ట్ బర్త్డే కావడంతో ఈ రోజు మెగా ఫ్యామిలీ ఇంట సంబరాలు అంబరాన్ని అట్టబోతున్నాయి.
మరోవైపు సోషల్ మీడియా ద్వారా మెగా అభిమానులు మరియు నెటిజన్లు రామ్ చరణ్, ఉపాసన దంపతుల లిటిల్ ప్రిన్సెస్ కు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఇకపోతే క్లిన్ కారా రాకతో మెగా ఫ్యామిలీ జాతకమే మారిపోయింది. ఈ బుజ్జాయి కడుపున పడ్డప్పటి నుంచి అన్ని శుభాలే జరుగుతూ వచ్చాయి. క్లిన్ కారా తల్లి గర్భంలో ఉండగా రాంచరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని `నాటు నాటు` పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అత్యంత ప్రతిష్టాకమైన ఆస్కార్ అవార్డు వరించింది. అదే సమయంలో రామ్ చరణ్ ప్రాంతీయ స్టార్ నుంచి గ్లోబర్ స్టార్ గా అవరించాడు.
క్లిన్ కారా పుట్టిన తర్వాత మెగా ఇంటి పెళ్లి బాజాలు మోగాయి. నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠిని పెళ్లాడి ఓ ఇంటివాడు అయ్యాడు. అలాగే క్లిన్ కారా తాతయ్య, మెగాస్టార్ చిరంజీవి భారత రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ ను అందుకున్నారు. ఇంకోవైపు పుష్ప సినిమాకు గానూ మెగా ఫ్యామిలీ మెంబర్ అయిన అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు.
ఇక రీసెంట్ గా సార్వత్రిక ఎన్నికల్లో క్లిన్ కారా చిన్న తాత, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నిజయోకవర్గం నుంచి భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన డిప్యూటీ సీఎంగా మరియు మినిస్టర్ గా సైతం బాధ్యతలు చేపట్టారు. ఈ శుభాలన్నీ క్లిన్ కారా రాకతోనే జరగడంతో.. మెగా ఫ్యామిలీకి ఆమె లక్కీ లక్ష్మిగా మారిపోయింది.