చాలా మందికి ఉన్న పెద్ద ప్రశ్న ఇదే! రామోజీ గురించి తెలిసిన వారికి కూడా.. ఈ ప్రశ్నకు సమాధానం అంతంత మాత్రంగానే తెలుసు. ఎందుకంటే.. ఆయన ఇప్పటి వరకు ఏ గుడికీ వెళ్లిన సందర్భం లేదు. ఏ గుడినీ.. దర్శించిన సంగతి కూడా వెలుగు చూడలేదు. కానీ.. ఈనాడులోనూ.. ఈటీవీలోనూ.. మాత్రం అనేక ఆధ్యాత్మిక అంశాలతోపాటు.. ప్రతివారం తీర్థయాత్ర పేరుతో కార్యక్రమాలు కూడా ప్రసారం అవుతుంటా యి. ఇలా చూసుకుంటే.. రామోజీ దేవుణ్ణి నమ్ముతారని కొందరు.. నమ్మరని మరికొందరు చెబుతారు.
అయితే.. రామోజీ దేవుణ్ణి నమ్ముతారా? నమ్మరా? అనేది పక్కన పెడితే.. విశ్వసిస్తారు అంతే! ఏ గుడికీ ఆయన వెళ్లరు. ఏ దేవుడికీ మొక్కరు. దీనికి ఆయన చెప్పే సూత్రం ఒక్కటే.. మన కృషి మనకు దైవంతో సమానం. నువ్వు వెయ్యి గుళ్లకు వెళ్లి.. దేవుళ్లకు మొక్కి.. ఇంటి కొచ్చి పడుకుంటే.. పని అవుతుందా? అని ప్రశ్నిస్తారు. ఇప్పుడు మనం అందరూ చెప్పుకొనే… `పనియే దైవం` అనే మాట ఈనాడుతోనే అవతరిం చింది. ఆ తర్వాత.. ఆ నోటా ఈనోటా పాకి… నానుడిగా మిగిలింది.
`నాస్తికులకు తిరుమల గురించి ఏం తెలుసు` అంటూ.. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. కాసు బ్రహ్మానందరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఈనాడు పెద్ద ఎత్తున నిప్పులు చెరిగింది. వరుస కథనాలతో కాసుపై విరుచుకుపడింది. దీనికి కారణం.. తిరుమల విస్తరణ పేరుతో చేపట్టిన కార్యక్రమాలు. వీటిపై వ్యతిరేక రావడంతో కాసు విరుచుకుపడ్డారు. రామోజీని టార్గెట్ చేశారు. దేవుడి గురించి తెలియాలంటే.. దణ్ణాలు పెట్టక్కర్లేదు.. అంటూ.. వ్యాసాలతో కౌంటర్ ఇచ్చారు.
తన జీవితంలోనూ రామోజీ ఏ కొండకు వెళ్లలేదు. ఏ దేవుడినీ మొక్కలేదు. కానీ, తన పనిలో తాను దేవుణ్ణి చూసుకున్నారు. ఇతరు లమనోభావాలను కించపరచలేదు. పిల్లలకు వివాహ క్రతువుశాస్త్రోక్తంగా నిర్వహించినప్పుడు కుటుంబానికే ఆ బాధ్యత వదిలేశారు. దేవుడి విషయంలో ఆయన ఆసాంశం అవలంభించింది.. తటస్థ విధానం. ఏ మతాన్నీ.. ఏ దేవుణ్ణి.. ఉందని చెప్పలేదు. లేదని వాదించనూ లేదు. విశ్వాసాలను కాపాడే ప్రయత్నం మాత్రం చేశారు.