కొత్త విషయం బయటకు వచ్చింది.కొద్ది రోజులుగా ఏపీ ప్రభుత్వానికి.. ప్రభుత్వ ఉద్యోగులకు మధ్య నడుస్తున్న పీఆర్సీ ఇష్యూ నేపథ్యంలో.. ఉద్యోగులు పెన్ డౌన్ పెట్టేయటం తెలిసిందే. అయితే.. ఇలాంటివేళలోనే జగన్ ప్రభుత్వం అనూహ్య నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు.
రాజధాని అమరావతి పరిధిలోని సుమారు 480 ఎకరాల భూమిని సీఆర్డీఏ రుణం కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బందిపై ప్రభుత్వం ఒత్తిడి తెచ్చినట్లుగా చెబుతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. రూ.3వేల కోట్ల అప్పుకోసం భూమిని తనఖా పెట్టినట్లుగా చెబుతున్నారు.
రాజధాని అమరావతిలోని అనంతవరం.. మందడం.. ఉద్ధండరాయునిపాలెం.. లింగాయపాలెం.. వెంటకపాలెం గ్రామాల పరిధిలో రైతులు భూసమీకరణలో ఇచ్చిన భూమిలో సీఆర్డీఏ వాటాకు వచ్చిన భూమిలో కొంత భాగాన్ని తాకట్టుపెట్టారా? అన్నది ప్రశ్నగా మారింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. భూమిని తనఖా పెట్టారనే చెబుతున్నారు.
అయితే.. దీనికి సంబంధించి సీఆర్డీడీఏ అధికారులను సంప్రదించే ప్రయత్నం చేస్తే.. భూమిని బ్యాంకుకు తనఖా కింద అప్పు తీసుకున్నారన్న సమాచారం అందుతోంది. ఈ వాదన నిజమేనని.. రిజిస్ట్రేషన్ జరిగిందన్న విషయాన్ని అధికారులు నిర్దారిస్తున్నా.. ప్రభుత్వం మాత్రం ఆ విషయం మీద నోరు విప్పట్లేదు.
ఇదిలా ఉంటే తాజాగా తీసుకున్న రుణం సీఆర్డీఏ పరిధిలోనిదా? లేదంటే కొత్త రుణమా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. రూ.3వేల కోట్ల రుణానికి సీఆర్డీఏ భూమిని తనఖా పెట్టారా? లేదా? అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
రుణం తీసుకున్న మూడో ఏడాది నుంచి రాజధానిలోని 481 ఎకరాలను దశల వారీగా 15 ఏళ్ల పాటు విక్రయించి.. తీసుకున్న రుణాల్ని తీర్చేస్తామని డీపీఆర్ లో పేర్కొంటారని చెబుతున్నారు. మొత్తంగా ఇప్పుడు అప్పు తీసుకున్న రూ.3వేల కోట్లు ఎంతవరకు నిజం? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఏమైనా.. ఈ వివరాలు త్వరలోనే బయటకు వస్తాయన్న మాట వినిపిస్తోంది.