ఒకటి కాదు.. రెండు కాదు.. అప్పనంగా.. 175 కోట్ల ప్రజాధనం. అంటే.. ప్రజలు కష్టపడి సంపాయించి ప్రభుత్వానికి చెల్లించిన వివిధ పన్నుల రూపంలోని సొమ్మును ఏపీ ప్రభుత్వం ప్రజలకు కాకుండా.. ఒక మతానికి.. ఖర్చు చేయడం.. తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికే.. ఈ మతానికి చెందిన పాస్టర్లకు నెలనెలా రూ.5000 చొప్పున పింఛన్లు ఇవ్వడంపై రాష్ట్ర హైకోర్టే విస్మయం వ్యక్తం చేసింది. ఇదేం పంపకాలో సమాధానం చెప్పాలని నిలదీసింది.
ఇంతలోనే.. ఏపీ సర్కారు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా చర్చిల నిర్మాణం, మరమ్మతులు, ఇతర పనులకు ప్రభుత్వం రూ.175 కోట్లు అందించనుంది. నియోజకవర్గానికి రూ.కోటి చొప్పున కేటాయించనుంది.
కొత్త చర్చిల నిర్మాణం, పాతవాటి పునర్నిర్మాణం, మరమ్మతులు, చర్చి నిర్వహించే సంస్థలు, శ్మశాన వాటికల ఆధునికీకరణకు ఈ నిధులు వెచ్చించాలి. జిల్లా కేంద్రాల్లో అదనంగా మరో కోటి విలువైన పనులు చేపట్టేందుకు అనుమతి ఉన్నట్లు తెలిసింది.
ఈ నిధుల్ని గ్రాంటు ఇన్ ఎయిడ్ విధానంలో అందించనుంది. ఈ మేరకు ఎమ్మెల్యేల నుంచి ప్రతిపాదన లు స్వీకరించాలని రాష్ట్ర క్రైస్తవ ఆర్థిక సంస్థ ఈ నెల 7వ తేదీన ఉత్తర్వులు జారీచేసింది. ఆ ప్రకారం కలెక్ట ర్లు జిల్లాల్లో ప్రతిపాదనల స్వీకరణకు ఆదేశాలు ఇస్తున్నారు. ఈ నెల 19లోగా ప్రతిపాదనలు అందించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక చర్చిల నిర్మాణం, మరమ్మతులు, ఇతర పనులకు భారీగానే దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు 200 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. మరి ఇది కూడా రేపు హైకోర్టుకు వెళ్తే.. అక్కడ ఏం సమాధానం చెబుతారో.. ఎలా సమర్ధించుకుంటా రో చూడాలి. ఇదిలావుంటే, రాష్ట్రంలో రోడ్లపై గోతులు మాత్రం అన్ని మతాలు.. మతేతర ప్రజలను కూడా వెక్కిరిస్తున్నాయి!!