వైసీపీ నేతలు కుళ్లుకునేలా.. కుప్పం కిటకిటలాడింది. ఇటీవల వైసీపీ మంత్రి, అదే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన రోజా.. టీడీపీ యువనాయకుడు నారా లోకేష్ యువగళం పాదయాత్రపై ఒక కామెంట్ చేశారు. “ఆయన పాదయాత్రలో ఆయనొక్కడే ఉంటాడు“ అని ఎద్దేవా చేశారు.
కానీ, వైసీపీ నాయకుల కళ్లు తెరిపిస్తూ.. యువగళం పాదయాత్ర ప్రారంభం రోజే.. కుప్పం కిటకిటలాడిపోయింది. చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని లక్ష్మీపురంలో ఉన్న శ్రీవరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి.. తొలి అడుగు వేశారు.
వస్తున్నాడు ???????????? #YuvaGalamPadayatra pic.twitter.com/WQLkrg35oG
— iTDP Official (@iTDP_Official) January 27, 2023
అయితే, ఈ పాదయాత్ర తొలిరోజు జైత్రయాత్రగా సాగింది. సైకో పాలనను సాగనంపుదాం అనే నినాదంతో కుప్పంలోని ప్రసన్న వరదరాజస్వామి ఆలయంవద్ద పాదయాత్రకు తొలి అడుగు వేసిన నారా లోకేష్ రాష్ట్రం నలుచెరగల నుంచి వచ్చిన వేలాది కార్యకర్తల జయజయద్వానాల మధ్య చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టారు.
కార్యకర్తలు యువనేతపై పూలవర్షం కురిపిస్తూ, బాణాసంచా కాలుస్తూ హోరెత్తించారు. రాష్ట్ర చరిత్రలో ఇదివరకెన్నడూ లేనివిధంగా 400 రోజులపాటు 4వేల కిలోమీటర్ల పొడవున యువగళం యాత్ర సాగనుంది.
పాదయాత్ర ప్రారంభమయ్యాక దారిపొడవునా మహిళలు హారతులిస్తూ లోకేష్‌కు ఘనస్వాగతం పలికారు. గత 40 ఏళ్లుగా చంద్రబాబుపై అంతులేని అభిమానాన్ని కురిపిస్తున్న కుప్పం ప్రజలు యువనేత చేపట్టిన పాదయాత్రకు ఆశీస్సులు అందజేస్తూ సంఘీభావం తెలిపారు. మార్గమధ్యంలో భారీ గజమాలను యువనేతకు అలంకరింపజేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. యువనేతతో కరచాలనం చేసేందుకు యువతీయువకులు పోటీపడ్డారు.
పాదయాత్రకు ముందు లక్ష్మీపురం మసీదును లోకేష్ సందర్శించారు. మసీదులో ప్రార్థనల్లో పాల్గొన్న లోకేష్‌కు.. ముస్లిం మత పెద్దలు ఆశీర్వచనం అందించారు. అనంతరం కుప్పంలోని బాబూనగర్‌లోని చర్చిలో ప్రత్యేక ప్రార్థన చేశారు. సంఘీభావంగా రాష్ట్రం నలుమూలల నుంచి పెద్దఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలిరావడంతో కుప్పం వీధులన్నీ కిటకిటలాడాయి. యువనేత వెంట భారీగా కదిలిన పసుపుదండుతోపాటు స్థానికులను అదుపుచేయడం భద్రతాసిబ్బందికి కష్టంగా మారింది.
డప్పు వాయిద్యాలు, తీన్మార్ దరువుల మధ్య డాన్సులు చేస్తూ యువతీ యువకులు.. యువగళం పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. కుప్పం బస్టాండ్ సమీపంలో అంబేద్కర్, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు లోకేష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. మొత్తానికి ఇవన్నీ లైవ్‌లో చూస్తున్న వైసీపీ నాయకులకు ఏం మాట్లాడాలో గొంతు పెగలడం లేదని టీడీపీ నేతలు వ్యాఖ్యానించడం గమనార్హం.
Open Challenge to @ysjagan from @naralokesh ????????#YuvaGalamPadayatra #YuvaGalamLokesh pic.twitter.com/LMrXzXTIcZ
— Play Boy (@BattingPlay) January 27, 2023