36 కేసులు ఉన్నాంకి మీరు సపోర్ట్ చేస్తున్నారు 16 నెలలు జైల్లో కూడు తిన్నాను కూడా మీరు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు సీఎంగా అవ్వంగాలేదని మా నాయకుడు ఎమ్మెల్యే అయితే నీకెందుకు https://t.co/5LQTX6mDHv
— RAMESH MIRIYALA (@RAMESHM78896860) March 15, 2023
ఇడుపుల పాయ బూతుల యూనివర్సిటీ బూతుల స్పెషలిస్ట్ ప్రొఫెసర్ కూడా అర్హత ల గురించి మాట్లాడుతున్నారు అంటే, సిగ్గే సిగ్గుతో చచ్చిపోతుంది! https://t.co/3TgeCaSA7y
— M.Suryanarayana (@ss_mps) March 15, 2023
ఏపీ రాజకీయాల్లో చిత్రమైన విషయం. వచ్చే ఎన్నికల్లో అయినా.. రాజకీయాల్లో అయినా.. పవన్ ఒక్కడే రావాలి.. వైసీపీతో తలపడాలి. ఇదీ.. వైసీపీ నేతల మాట. కానీ, పవన్‌పై మాత్రం.. వైసీపీ నాయకులు మూ కుమ్మడిగా కలబడతారన్న మాట. ఇప్పుడు ఇదే జరిగింది. తాజాగా మచిలీపట్నం జనసేన ఆవిర్భావ సభలో పవన్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు వరుస పెట్టి విరుచుకుపడ్డారు. ఒకరు కాదు ఇద్దరుకాదు.. ఏకంగా నేతలు మీడియా ముందు క్యూ కట్టారు.
పేర్ని నాని..
చంద్రబాబు మేలు కోసమే పవన్ రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని దుయ్యబట్టారు. పవన్ కల్యాణ్ నిస్సిగ్గుగా కుల రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కాపులను రెచ్చగొట్టేలా పవన్ మాట్లాడుతున్నారు. పవన్ మాట్లావేవన్నీ అసత్యాలే. పవన్ వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయి అంటూ దుయ్యబట్టారు. చంద్రబాబుతో కలిసి వెళ్తున్నానని చెప్పాడు. సంతోషం నీ ముసుగు తీశావు. విడివిడిగా కాదు.. కలిసే రండి. కాపులందరూ సీఎం జగన్ వైపే ఉన్నారు. అని పేర్ని వ్యాఖ్యానించారు.
గుడివాడ
రాజకీయ సిద్ధాంతం లేని పార్టీ జనసేన అని మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ఏ ఉద్దేశంతో నిన్న సభ పెట్టారో పవన్‌కే తెలీదు.. జెండా పవన్‌ది.. అజెండా టీడీపీది అని ఎద్దేవా చేశారు. కాపు కులాన్ని మూటగట్టి బాబుకు అమ్మేయాలన్నదే లక్ష్యమన్నారు. 175కు 175 స్థానాల్లో పోటీ చేసే ధైర్యం లేదన్నారు. నీది కాపు జనసేన కాదు.. కమ్మ జనసేన అంటూ మంత్రి నిప్పులు చెరిగారు.
కరణం ధర్మశ్రీ
పవన్ పవర్ స్టారా..? ఫ్లవర్ స్టారా అంటూ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఎద్దేవా చేశారు. నీ మాటలు అన్నీ విడ్డూరంగా ఉన్నాయి. కాపు కులం అంతా సీఎం జగన్ వైపే ఉంది. రాజకీయంలో ఓ అజెండా ఉండాలి. జనసేన తొత్తుల పార్టీ అని ఆక్రోశం వెళ్లగక్కారు.
బాబాయ్ ని ఏసేసి ఏమి యాక్టింగ్ రా బాబు.#JusticeForYSViveka pic.twitter.com/wvJQGJ9u5G
— iTDP Official (@iTDP_Official) March 15, 2023